BigTV English

Pushpa 2 Collections : పుష్ప రాజుకి బ్రేకులు పడ్డాయా… ఒక్కసారిగా పడిపోయిన కలెక్షన్స్…

Pushpa 2 Collections : పుష్ప రాజుకి బ్రేకులు పడ్డాయా… ఒక్కసారిగా పడిపోయిన కలెక్షన్స్…

Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప 2.. రోజుకో ట్విస్ట్ ఇస్తుంది. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను నిజం చేస్తూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే స్త్రీ 2, జవాన్, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల రికార్డులను గల్లంతు చేసిన పుష్ప 2.. 2000 కోట్లు రాబడుతుందని అనుకున్నారు. ప్రస్తుతం 1600 కోట్లకు పైగా రాబట్టింది. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. అది నిన్నటివరకు ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ డౌన్ అయ్యాయాన్ని తెలుస్తుంది. అల్లు అర్జున్ వివాదాల్లో చిక్కు కోవడమే అందుకు కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు కలెక్షన్స్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..


భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ పుష్ప 2 వారంలోనే రికార్డు బ్రేక్ చేసింది. 1000 కోట్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. అలాగే గతంలో వసూల్ చేసిన మూవీ రికార్డులను బ్రేక్ చేసేసింది. రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నాలుగు నెలలు ఆలస్యంగా థియేటర్‌లలో దిగింది. అయినప్పటికీ పుష్ప 2 మీదున్న హైప్ కొంచెం కూడా తగ్గలేదు.. అదే స్పీడులో మూవీ ఇప్పుడు రికార్డులను బ్రేక్ చేసింది. అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..

ఈ మూవీ దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు . అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పుష్ప 2.. ప్రస్తుతం 1630 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక రెండు వారాలు ప్రభంజనాన్ని సృష్టించిన మూవీ మూడో వారంలో కాస్త డల్‌గా కనిపించిన పుష్ప 2.. గత వీకెండ్‌లో మాత్రం ఏకంగా రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టి దుమ్ములేపింది.. ఇప్పుడు ఇంకాస్త కలెక్షన్స్ డౌన్ అయ్యాయని తెలుస్తుంది. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చెయ్యడం కష్టమనే టాక్ వినిపిస్తుంది.. అందుకు కారణం అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. కోరి తెచ్చుకున్న కొన్ని వివాదాలే కలెక్షన్స్ పై దెబ్బేసిందని, అందుకే రెండు రోజులుగా దారుణంగా పడిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.. క్రిస్మస్ సెలవలకు సినిమా కలెక్షన్స్ పెరుగుతాయో చూడాలి..


ఇక సంధ్య థియేటర్ ఘటన పై నిన్న అల్లు అర్జున్ ను మరోసారి చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపారు.. ఆయనను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక పోయాడని తెలుస్తుంది. మరి ఇక్కడితో కేసు పూర్తి అయ్యిందా? ఇంకా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×