BigTV English

AP State Fiber Net: ఏపీలో ప్రక్షాళన.. ఫైబర్ నెట్‌లో 410 మందిపై వేటు

AP State Fiber Net: ఏపీలో ప్రక్షాళన.. ఫైబర్ నెట్‌లో 410 మందిపై వేటు

AP State Fiber Net: చంద్రబాబు సర్కార్ దూకుడు పెంచిందా? కూటమి ప్రభుత్వంలో శాఖల వారీగా ప్రక్షాళన మొదలైందా? మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం వంతు కాగా, ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ వంతైందా? రేపు ఏ శాఖ అనేది అక్కడి ఉద్యోగుల వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?


వైసీపీ పాలనలో ఏపీని సర్వనాశనం అయ్యిందని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఏ శాఖ పట్టుకున్నా అవినీతి రాజ్యమేలుతోందని చెబుతున్నారు. ప్రతీ శాఖలో పులివెందుల నుంచి మనుషులను రప్పించి అందులో పెట్టారని చెబుతోంది. ఇప్పుడు వాటి బూజు దులిపే పనిలో కార్పొరేషన్ల ఛైర్మన్లు పడ్డారు.

ఈ నేపథ్యంలో తొలుత తిరుమల నుంచి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తొలుత కొద్దిరోజులపాటు ఆఫీసు వ్యవహారాలను చక్క బెట్టారు. నేరుగా భక్తులకు కలిసి వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత మిగతా పనుల్లో నిమగ్నమయ్యారు.


లేటెస్ట్‌గా ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమాల బూజు దులుపుతున్నారు కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక అక్రమ నియామకాలు జరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని ఛైర్మన్ జీవీరెడ్డి స్వయంగా వెల్లడించారు. నేతల సిఫార్సులతో అనవసరంగా అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టారు.

ALSO READ:  పట్టుబడ్డ ‘ పార్సిల్’ నిందితులు.. ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులు.. ఎవరిది ఈ క్రూర ఆలోచన అంటే..

ఈ విధంగా నియమించబడిన ఉద్యోగులపై వేటు వేశారు. ఒక్కరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది. తొలగింపు వెనుక చట్టపరమైన మార్గాలను అనుసరించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

వైసీపీని గెలిపించేందుకు ఎవరైతే ప్రచారంలో పాల్గొన్నారో వారందరికీ ఉద్యోగాలు ఇప్పించిందట అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ క్వాలిఫికేషన్‌కు ఎలాంటి సంబంధం లేదట. ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ లేకుండా మద్దతుదారుల అనుమతితో నియమించారు. వారంతా వైసీపీ నేతల ఇళ్లలో పనివారు, వంట మనుషులు, డ్రైవర్లను పని చేస్తున్నారు.

పని చేసేది నేతల ఇళ్లలో ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వశాఖలో అని తేలింది. దీంతో వేటు చేశారు ఛైర్మన్ జీవీ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్ విభాగం ఏర్పాటు చేసినప్పుడు కేవలం 108 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. వారి కింద 10 లక్షల కేబుల్ కనెక్షన్లు పని చేసేవి. అప్పట్లో 12 కోట్ల టర్నోవర్ నడుస్తూ ఉండేది.

వైసీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల సంఖ్య 12 రెట్లు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఆ విభాగంలో 1360 మంది ఉద్యోగులున్నారు. టీడీపీ హయాంలో 10 లక్షల కేబుల్ కనెక్షన్లు కాస్త 5 లక్షలకు పడిపోయింది. కనెక్టివిటీ తగ్గింది.. ఉద్యోగులు పెరిగిపోయారు.

కీలక నేతలు ఎవరైనా ఫోన్ చేసి చెబితేచాలు అందులో ఉద్యోగాలు ఇచ్చేవారట. నోటిఫికేషన్ లేదు.. కేడర్ లేదు.. అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఇవన్నీ జరిగాయని తేలింది. పైనుంచి ఎంత చెబితే అంత శాలరీ ఫిక్స్ చేసేవారట. ఆ రకంగా 1360 మందికి సుమారు 4 కోట్ల రూపాయలు చెల్లించేది. ఆదాయం తగ్గి.. ఖర్చు పెరిగిపోయింది. ఈ వ్యవహారంపై లీగల్‌గా వెళ్లేలా ఆలోచన చేస్తున్నారు ఛైర్మన్ జీవీ రెడ్డి. మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి షోకాజ్, లీగల్ నోటీసులు పంపనున్నారు. వీలైతే డబ్బులు మళ్లీ రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట ఛైర్మన్.

 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×