ఆహార నియమాలు ప్రాచీన కాలం నుంచి ఎన్నో ఉన్నాయి. వాటిని పాటించేవారు కొందరైతే మరికొందరు బేకాతరు చేస్తారు. అయితే పెద్దలు మాత్రం నియమాలను బట్టి జీవించమని చెబుతారు. అలా హిందూ ఆచారాలలో ఇంట్లో వారికి లేదా ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు వారికి ఆహారం వడ్డిస్తే ప్లేట్లో మూడు రోటీలు లేదా మూడు చపాతీలు వడ్డించకూడదని అంటారు. కేవలం రోటీ, చపాతీలే కాదు ఏదైనా కూడా మూడు సంఖ్యలో వడ్డించకూడదు. అంటే మూడు ఇడ్లీలు, మూడు దోశలు… ఇలా. కానీ ఈ విషయం తెలియక ఎంతోమంది మూడు అంకెను ఫాలో అవుతూ ఉంటారు.
పురాతన గ్రంథాలలో లేదా మత గ్రంథాలలో శుభ అశుభాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే సమాజంలో ఎన్నో నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈనాటి యువత కొన్ని విషయాలను పట్టించుకోదు. కానీ పెద్దలు మాత్రం ఇప్పటికే కొన్ని నియమాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారు. అలాంటి వాటిలో ఒక ప్లేటులో ఈ ఆహారాన్ని కూడా మూడు అంకెలో వడ్డించకూడదని అంటారు. రెండు రోటిలను వేయొచ్చు లేదా నాలుగు రోటీలను వేయొచ్చు. కానీ మూడు అంకెతో మాత్రం ఏ ఆహారాన్ని ప్లేట్లో పెట్టకూడదు.
శతాబ్దాల తరబడి ప్రజలు పాటిస్తున్న నియమాల్లో ఇది ఒకటి. ఇది మీకు వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ దీనికి కారణం ఉంది. ఈ సూచనలను పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి అశుభ సంఘటనలు వారి జీవితంలో జరగవు అని అంటారు.
జ్యోతిష్య శాస్త్రంలో మూడు అంకెలు అశుభమైనవిగా పరిగణిస్తామని కొంతమంది జ్యోతిష్యులు వివరిస్తున్నారు. అందుకే రెండు లేదా నాలుగు అంకెల్లోనే ఏదైనా వడ్డించుకుని తినమని చెబుతారు. కానీ మూడు అంకెకు ప్రాధాన్యత ఇవ్వద్దని అంటారు. వీలైతే ఒక రోటి తిని ఆ తర్వాత రెండు రోటీలను వడ్డించుకుని తినవచ్చు. అంతే తప్ప మూడు రోటీలను ఒకేసారి వేసుకోవలసిన అవసరం లేదు. ప్రార్థన కాలం నుండి ఈ నమ్మకం ప్రజల్లో ప్రభలంగానే ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ నమ్మకమే పెద్ద పునాదిగా మారింది.
Also Read: నాన్ వెజ్ తినే రాష్ట్రాల్లో అదే టాప్.. ఏపీ, తెలంగాణ ఏ ప్లేస్ లో ఉన్నాయో తెలుసా?
ఒక మరణించిన వ్యక్తి కోసం ఆహారాన్ని వడ్డించే ఆచారం ఉంటుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్లేటులో మూడు రోటీలను ఉంచి మరణించిన వ్యక్తి కోసం బయట పెడతారు. అవి పక్షులు వచ్చి తినడం వంటివి చేస్తాయి. ప్రధానంగా పితృపక్షం సమయంలో పూర్వీకుల పళ్లెంలో మూడు రోటీలు వడ్డించే నియమం చాలా ప్రాంతాల్లో ఉంది. ఒక ప్లేటులో మూడు చపాతీలను వడ్డించారంటే అది చనిపోయిన వ్యక్తికి పెడుతున్నట్టే లెక్క అని గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో మూడు అనే సంఖ్య అశుభమైనదిగా చెబుతారు. కాబట్టి ఏ శుభకార్యంలో కూడా మూడు అనే సంఖ్యను వాడరు. అలాగే మూడవ తేదీన ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించరు. 5,7, 11 21 వంటి బేసి సంఖ్యలను శుభంగా చెప్పుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు ప్లేటులో మూడు చపాతీలు, మూడు దోశలు ఇలా మూడు ఆహార ఉత్పత్తులను వేసుకొని తినడం అనేది మానేస్తే మంచిది.