Allu Arjun – Prabhas: అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతేకాదు రూ.1800 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఇకపోతే ఇక్కడి వరకు అంతా బాగున్నా.. తాజాగా మరొకసారి కాస్త తల పొగరుగా ప్రవర్తించి ప్రభాస్(Prabhas) అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప 2..
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. ఇక ఇందులో జగపతిబాబు, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి భారీ తారాగణం భాగమైంది. దీనికి తోడు జాతర సీక్వెన్స్ ఈ సినిమాకి ప్లస్ గా మారిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడానికి కారణం కూడా ఈ సన్నివేశం అని చాలామంది సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోన్న అల్లు అర్జున్, క్షణికావేశంలో చేస్తున్న పనులు ఇతరులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయనను మళ్ళీ వివాదంలోకి నెట్టేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బాహుబలి2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
అల్లు అర్జున్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
అయితే ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్ ను పెట్టి, ఒక రీల్ చేశారు మీమర్స్ . అందులో బాహుబలిని ఎగిరి తన్నినట్టుగా ఆ మీమ్ ఉంది. అలాంటి మీమ్ ను అల్లు అర్జున్ ఇప్పుడు లైక్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. అప్పుడున్న రేట్లు ఏంటి? ఇప్పుడున్న రేట్లు ఏంటి? అయినా ఆ రికార్డును లేపేందుకు మీకు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? అంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆయన తీరును తప్పుపడుతున్నారు. ఇలాంటివే తగ్గించుకోవాలి అన్నా.. లేకపోతే నీకు వ్యతిరేకత తప్పదు.. అంటూ అల్లు అర్జున్ కి యాంటీ గా ట్వీట్లు పెడుతున్నారు .
ఇక ప్రస్తుతం ఈ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంత జరిగినా.. ఇంకా మారకపోతే కష్టమని సొంత అభిమానులే సలహా ఇస్తుండడంతో అల్లు అర్జున్ ఇకనైనా మారతారా? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరువలేని సంధ్యా థియేటర్ ఘటన..
ఇకపోతే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అక్కడకు బన్నీ ఫ్యామిలీతో సహా సినిమా చూడడానికి వచ్చాడు. అయితే ఇదంతా బాగానే ఉన్నా పోలీసులు వద్దని చెప్పినా ర్యాలీ నిర్వహించి తొక్కిసలాటకు కారణమయ్యాడు. అందులో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక ఈ ఘటన ఎప్పటికీ మరువలేనిది..ఇక ఈ విషయంపై జైలుకెళ్ళిన బన్నీ రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ షరతులు తప్పనిసరి. ప్రస్తుతం ఇలా ఎన్నో సమస్యల మధ్య సతమతమవుతున్న బన్నీ, మళ్లీ అలాంటి తప్పే చేసి కొత్త విమర్శలను కొని తెచ్చుకుంటున్నాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా బన్నీ తన తీరును మార్చుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.