BigTV English

Allu Arjun Case : చట్టం దృష్టిలో అందరూ ఒకటే… అల్లు అర్జున్ కామెంట్స్ పై డీజీపీ రియాక్షన్..

Allu Arjun Case : చట్టం దృష్టిలో అందరూ ఒకటే… అల్లు అర్జున్ కామెంట్స్ పై డీజీపీ రియాక్షన్..

Allu Arjun Case :అల్లు అర్జున్ (Allu Arjun)కలలు కన్న విషయాలు కళ్ళముందే జరుగుతున్నా..ఆ ఆనందాన్ని పొందులేని పరిస్థితి ఆయనది అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో డిసెంబర్ 4వ తేదీన వేయగా.. హైదరాబాదులోని క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. అయితే కారులో అభివాదం చేసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. అందులో భాగంగానే రేవతి(39) అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ విషయం తెలిసిన తరువాత కూడా అల్లు అర్జున్ ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు అని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


అసలు సమస్య అక్కడే మొదలైంది..

కానీ సంధ్యా థియేటర్ వద్ద జరిపిన ర్యాలీ కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించగా.. క్వాష్ పిటిషన్ ద్వారా మరుసటి రోజు విడుదలై బయటకొచ్చారు. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీనే కాదు కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ ఆయనను పరామర్శించారు. అయితే ఈ విషయం తెలుసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తప్పిదం వల్లే ఒక ప్రాణం పోయింది. అయితే అల్లు అర్జున్ ఏమాత్రం దీనిపై స్పందించలేదు. కానీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లాడని తెలిసి సినీ సెలబ్రిటీలంతా కూడా ఆయన ఇంటికి క్యూ కట్టారు..ఆయన కాలు పోయిందా? కన్ను పోయిందా? కొంచమైనా మానవత్వం చూపించండి అంటూ కామెంట్లు చేశారు. ఇక ఇదంతా జరిగిన అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


అల్లు అర్జున్ కామెంట్స్ పై డీజీపీ రియాక్షన్..

అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ డీజీపీ జితేందర్(DGP Jitendar) చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. “సినిమాలోనే హీరోలు. బయట మాత్రం ప్రతి ఒక్కరు పౌరులే. అందరూ చట్టానికి లోబడి ఉండాలి. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం కాదు. పౌరులంతా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.అల్లు అర్జున్ కి మేము వ్యతిరేకత కాదు.. ఆయనపై చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకుంటాము. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)పై కూడా కేసు నమోదు చేశాము. అయితే ఆయనది కుటుంబ సభ్యుల సమస్యలు. అలాగే మీడియా ప్రతినిధులపై చేసిన దాడుల విషయంలో కూడా లా ప్రకారం మోహన్ బాబు పై యాక్షన్ తీసుకుంటాము” అంటూ జితేందర్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చట్టం దృష్టిలో అందరూ సమానులే.. తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×