Tirumala Laddu: తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని టీటీడీ ప్రకటించింది. అంతేకాదు సామాన్య భక్తులు అలా రావడంతోనే, వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్థుల విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. ఇంతకు టీటీడీ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటో ఓసారి చూద్దాం.
తిరుమల ఈవో శ్యామల రావు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల గురించి ఈవో మాట్లాడారు. ఆరు నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తున్నట్లు తెలిపారు. తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, సర్వదర్శనం భక్తులను క్యూలైన్స్ వేచి ఉండే సమయాన్ని తగ్గించామన్నారు. భక్తులకు సాధ్యమైనంత త్వరగా దర్శనం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచడం జరిగిందని, పారిశుధ్యం, క్యూలైన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈవో తెలిపారు. దాతలు నిర్మించిన అతిథి గృహాల పేరు మార్పుకు చర్యలు తీసుకున్నామని,
45 అతిథి గృహాలకు టీటీడీ సూచించే పేర్లను దాతలు ఎంపిక చేయాల్సి ఉందన్నారు. సీఎం ఆదేశానుసారం మిషన్ 2047 అమలు చేస్తున్నట్లు, 2019 మాస్టర్ ను మరింత అభివృద్ధి చేసి అమలు పరిచే విధంగా చర్యలు ఉంటాయన్నారు. తిరుమల క్షేత్రాన్ని అన్ని అత్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలిపేందుకు టీటీడీ వెనుకడుగు వేయబోదని ఈ సంధర్భంగా ఈవో తెలిపారు.
కాలిబాట, మల్టీ లెవెల్ పార్కింగ్, రోడ్ల విస్తరణ, లింక్ రోడ్డుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, 42 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు, తిరుమలకు వచ్చే వాహనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అన్యమత ఉద్యోగస్తులను ఇతర శాఖలకు బదిలీ , లేదా వీఆర్ఎస్ తీసుకొనే వెసులుబాటు సౌకర్యం ఉందని, ఇక తుది నిర్ణయం వారికే వదిలేస్తామని తెలిపారు. అనధికార షాపులు, హాకర్ లపై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు, తిరుమలలోని హోటల్స్ లో నాణ్యత లేదని తమ దృష్టికి వచ్చిందని, పెద్ద హోటల్స్, జనతా క్యాంటీన్ల పై ఓ పాలసీ తీసుకొచ్చేందుకు ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నెయ్యి కల్తీని గుర్తించేలా తిరుమలలో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్డీడీబీ సహకారంతో రూ. 70 లక్షల విలువ చేసే యంత్రాలు విరాళంగా అందాయన్నారు ఈవో. ల్యాబ్ లో పనిచేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నట్లు, నెయ్యి పరీక్షలపై ప్రస్తుతం ట్రయల్ రన్ సాగుతుందన్నారు. ప్రసాదాలకు వినియోగించే ముడి సరుకు సరఫరా చేసేందుకు రిలయన్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు, జీడిపప్పు, బాదంపప్పు, శనగ పప్పు, కందిపప్పు, ఉద్దిపప్పు ఇస్తారా పదార్థాలు రిలయన్స్ సరఫరా చేస్తుందని ఈవో తెలిపారు.
Also Read: Shani Gochar 2025: శని ప్రభావంతో.. 2025 లో వీరిపై కనక వర్షం
టీటీడీ పరిధిలోని 61 ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, తిరుచానూరు అమ్మవారి ఆలయ మాడ విధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలను అభివృద్ధి చేస్తామని, హిందూ ధార్మిక పరిషత్ కోసం టీటీడీ ఏటా రూ. 100 కోట్లు వ్యచిస్తుందని, ధార్మిక పరిషత్ లో లోపాలను కూడా గుర్తించామని ఈవో తెలిపారు. ఆడిట్ చేసి అవకతవకలను బయటపెడతామంటూ ఈవో మీడియా ముఖంగా ప్రకటించారు.