E-Paper
Advertisement

Pushpa 2 Update: ‘పుష్ప 2’ నుండి అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

Pushpa 2 Update: ‘పుష్ప 2’ నుండి అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Advertisement

Pushpa 2 Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్, ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడంతా సెకండ్ పార్ట్‌ కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. మొదటి పార్ట్ నార్మల్ టాక్‌తో రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును అందుకుంది. యావత్ ప్రపంచ సినీ ప్రియులు బన్నీ స్వాగ్‌కి ఫిదా అయిపోయారు.

దీంతో ఎక్కడ చూసినా బన్నీ స్టైల్ వీడియోలే దర్శనమిచ్చాయి. ప్రముఖ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, ఇతర సెలబ్రిటీలు సైతం ‘పుష్ప’ మూవీలోని డైలాగ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేశారు. అంతేకాకుండా ఈ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

ఇందులో భాగంగానే దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్‌ని ఫస్ట్ పార్ట్‌ కంటే మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాడు. ఇందులో బన్నీ లుక్స్ మరింత స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించగా. గ్లింప్స్, సాంగ్స్ సినిమా రేంజ్‌ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా సాంగ్స్‌ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ దుమ్ము దులిపేశాయి.

Also Read:రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ సందడి..శరవేగంగా షూటింగ్!

Advertisement

రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ నెల అంటే ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ మూవీ షూటింగ్ తో పాటు ఇతర పనులు పెండింగ్‌‌లో ఉండటంతో సినిమా వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే అది కూడా వాయిదా పడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ను మేకర్స్ గ్రాండ్ లెవెల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×