BigTV English

Narayana Swamy Comments: జగన్ వల్లే ఈ పరిస్థితి.. నారాయణ ఆవేదన

Narayana Swamy Comments: జగన్ వల్లే ఈ పరిస్థితి.. నారాయణ ఆవేదన

ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల వల్లే వైసీపీ ఓడిపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముఖ్యమంత్రి. చంద్రబాబునాయుడు పేరు చెప్తే సామాజికవర్గం పరంగా చెలరేగిపోయే నారాయణస్వామి ఆయన్ని విమర్శించనంటూనే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ ఈ రెండు పథకాలు కొనసాగిస్తే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుంది వివరంగా చెపుతున్నారు. పనిలో పనిగా ఓటమి తర్వాత ఇంత కాలానికి మీడియా ముందుకొచ్చి కూటమి ఇచ్చిన హామీల అమలు ఏలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

మాజీ డిప్యూటీ సియం నారాయణ స్వామి మూడు సార్లు శాసనసభ్యుడు. ఒక సారి మంత్రి , ఓసారి ఉమ్మడి రాష్టంలో సత్యవేడు నుంచి గెలుపు…రెండు సార్లు వరుసగా జిడి నెల్లూరు నుంచి విజం ఎస్సీ సామాజిక వర్గంలో కీలక నాయకుడు. మరో వైపు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అవిర్బావం నుంచి పనిచేశారు. 2019లో అయనకు వైసిపి ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సిఎంతో పాటు ఎక్సెజ్‌తో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ కేటాయించారు. దీంతో పాటు ఆయనకు జగన్ అనధికారికంగా మరో శాఖ కూడా కేటాయించారు. అది చంద్రబాబును ఎక్కడిపడితే అక్కడ అవసరం ఉన్నా లేకున్నా విమర్శించడం  మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేసేవారు.


అయితే నారాయణస్వామి ఆ అనధికార శాఖ బాధ్యతలే సమర్ధంగా నిర్వహించారన్న పేరుంది. ఇది శృతి మించి చంద్రబాబు సొంత సామాజిక వర్గంతో పాటు సొంత నియోజకవర్గంలో తనకు అసమ్మతిగా తయారైన రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం నిరంతరం విమర్శించేవారు. అయన తన శాఖల పనితీరు గురించి ఏరోజు మీడియా సమావేశంలో మాట్లాడ లేదు కాని. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ను మాత్రము నిరంతరం విమర్శించారు. చివరకు తిరుమల లో సైతం రాజకీయ విమర్శలు చేసిన వ్యక్తులలో ఒకరిగా అపవాదు మూటగట్టుకున్నారు.

రాష్ట వ్యాప్తంగా వైసీపీ ఎలాంటి ప్రతి కూలత వచ్చినా. తనకు జీడి నెల్లూరులో తిరుగుకుండదని నారాయణస్వామి గుడ్డిగా నమ్మారు. అందుకు కారణం ఆ నియోజకవర్గంలో ఎస్సీ మాలతో పాటు రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు 60శాతం వరకు ఉంటాయి. దాంతో తనకు తిరుగులేదని బావించారు. ఇలాంటి సమయంలో టిడిపి తెలివిగా పావులు కదిపి ముందుగా చిట్టిబాబు నాయుడిని కన్వీనర్ గా నియమించింది. ఆయన గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేసారు. ఏదైతే తన బలం అని నారాయణస్వామి బావించారో అరెండు వర్గాలలో చీలికలు తేవడంలో సక్సెస్ అయ్యారు.

Also Read: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. స్పీడ్ పెంచాలంటూ.. త్వరలో తనిఖీలు..

అదే సమయంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్ థామస్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు. అటు చూస్తే వైసీపీ ముందు నారాయణస్వామిని ముందుగా ఎంపి అభ్యర్ధిగా ప్రకటించి ఆయన ససేమిరా అనడంతో తర్వాత మళ్లీ జీడినెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఈ సారి ఆయనకు కాకుండా ఆయన కుమార్తె కృపాలక్ష్మిని అభ్యర్ధినిగా ప్రకటించింది. ఆ గందరగోళం సర్దుబాటు చేసుకోవడానికే నారాయణస్వామి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. కుమార్తె విజయం కోసం చివరి రోజుల్లో ఆయన ఎంత కృషి చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన ఆయన తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ నియోజకవర్గంలో అభివృద్ది పనులు అగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడుగా సమాధానం చెప్తున్నారు. డిప్యూటీ సియం అయిన తాను టికెట్ల కోసం నలుగురికి సిపార్సు చేయాల్సి ఉండగా తన సీటు దక్కించుకోవడానికి అనేక కష్టాలు పెట్టారని .. తన కంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరగబడి మంచి పని చేసారని ఆదిమూలాన్ని అనేక ఇబ్బందులు పెట్టారని అఫ్ ద రికార్డుగా చెప్పుకోచ్చారు.

జగన్మోహన్ రెడ్డి సొంత సామామజిక వర్గం తీరు వల్ల పార్టీ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరోక్షంగా చెప్పుకొచ్చారు … వైసీపీ అభ్యర్ధులను ఇష్టనుసరం మార్చినాఎక్సెజ్ శాఖ తనది అయిన పెత్తనం ఎవ్వరిదో అందరికి తెలుసునని నిర్వేదం వ్యక్తం చేశారు … మొత్తం మీద ప్రెస్‌మీట్‌లో సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ప్రయత్నించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మధ్యలో ఆపి లేచిపోయారు.. ఏదేమైనా ఆగ్రకులాలపై ఇష్టారీతిన చెలరేగిపోయి ఇంతకాలం రాజకీయం చేసిన ఆ సీనియర్ నేత.. ఇప్పుడు పరిస్థితి తిరగబడటంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడటం చర్చనీయాంశంగా మారింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×