BigTV English

Vikram: రాజమౌళితో చర్చలు నిజమే.. మహేష్ తో సినిమా.. ?

Vikram: రాజమౌళితో చర్చలు నిజమే.. మహేష్ తో సినిమా.. ?

Vikram: చియాన్ విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ కు తమిళ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది పొన్నియన్ సెల్వన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో తాజాగా తంగలాన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన మేకర్స్.. వరుస ప్రెస్ మీట్స్ పెడుతూ సినిమాపై హిప్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా తంగలాన్ టీమ్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. గతకొన్ని రోజులుగా రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB29 లో విక్రమ్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ ప్రెస్ మీట్ లో విక్రమ్ ను అదే ప్రశ్న అడిగారు రిపోర్టర్స్.


మీరు SSMB29 లో నటిస్తున్నారట.. నిజమేనా..? అన్న ప్రశ్నకు విక్రమ్ సమాధానం చెప్తూ.. ” రాజమౌళితో చర్చలు జరిపిన మాట వాస్తవమే. కానీ, అది SSMB29 కోసం కాదు. రాజమౌళి చాలా మంచి వ్యక్తి. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా మేము కలిసి సినిమా చేయాలనీ మాట్లాడుకుంటాం. కానీ, ఒక సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి మహేష్ అభిమానులకు నిరాశనే ఎదురయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి తంగలాన్ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×