E-Paper
Advertisement

Allu Arjun : ఇద్దరమ్మాయిలతో కాదు… ఏకంగా ఐదుగురమ్మాయిలతో బన్నీ రొమాన్స్… ఇదెక్కడి ప్లానింగ్‌రా మామ

Allu Arjun : ఇద్దరమ్మాయిలతో కాదు… ఏకంగా ఐదుగురమ్మాయిలతో బన్నీ రొమాన్స్… ఇదెక్కడి ప్లానింగ్‌రా మామ
Advertisement

Allu Arjun : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ ఆయనకు సక్సెస్ తో పాటు మరచిపోలేని వివాదాన్ని సైతం తెచ్చిపెట్టింది. ఇక వివాదం సద్దుమణడంతో ఆయన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ ఇద్దరు డైరెక్టర్లను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఎవరి ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కబోతోంది అనే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే, రెమ్యూనరేషన్, నటీనటుల వరకు అన్నీ విషయాలపై ఇంటెస్టింగ్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తాజాగా వినిపిస్తున్న కొత్త రూమర్ అల్లు అర్జున్ 5 మంది హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు అనేది.

బన్నీ – అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు 

Advertisement

బన్నీ – అట్లీ (Atlee) కాంబినేషన్లో రామన్న భారీ పాన్ ఇండియా సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి నేషనల్ మీడియాలో. మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుందని అంటున్నారు. ఆమెతో పాటు అమెరికా, కొరియా నుంచి మరో ముగ్గురు ఇంటర్నేషనల్ హీరోయిన్లను అట్లీ తన ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని సమాచారం. అలాగే ఈ మూవీలో మరో పాపులర్ ఇండియన్ హీరోయిన్ కూడా పార్ట్ కాబోతోందని అంటున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఈ వార్తలు ఎంత వరకు నిజం ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

స్టోరీ ఇదేనా?

Advertisement

అలాగే ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందని, అల్లు అర్జున్ ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. బన్నీ రోల్ ఒకటి వర్తమానంలో ఉంటే, మరొకటి గతంలో సాగుతుందని అంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు మరో బిగ్ స్టార్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడని రూమర్స్ విన్పిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ పాటలు కంపోజ్ చేస్తుండడం విశేషం. గతంలో అట్లీతో ఆయన చేసిన సినిమా భారీ విజయాన్ని సాధించింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే అంచనాలు మరింతగా పెరిగాయి. ‘పుష్ప’ పార్ట్ 1, పార్ట్ 2 లతో అల్లు అర్జున్ నార్త్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నార్త్ లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా బన్నీకి అభిమానులు ఏర్పడ్డారు పుష్పరాజ్ వల్ల. ఈ ప్రాజెక్ట్ ను మార్చ్ 20న అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా ఇండియన్ స్టార్ హీరోయిన్లతో ఆడిపాడిన బన్నీ, ఇప్పుడు రేంజ్ పెరిగి ఇంటర్నేషనల్ హీరోయిన్లతో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×