Chhaava Telugu:ఫిబ్రవరి 14వ తేదీన బాలీవుడ్ నుండి విడుదలైన సినిమా ఛావా (Chhaava). బాలీవుడ్ లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టింది. ముఖ్యంగా ఈ చరిత్ర తెలుసుకునేందుకు అటు పెద్దలు, ఇటు పిల్లలు అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఛావా సినిమాకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇకపోతే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మార్చి 7వ తేదీన గీత ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనుండగా ఇప్పుడు ఊహించని విధంగా ఈ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఛావా తెలుగు రిలీజ్ నిలిపివేయాలంటూ డిమాండ్..
దీంతో సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి అని అభిమానులు సైతం కంగారుపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఈ సినిమా తెలుగు రిలీజ్ ని నిలిపివేయాలని ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జియా ఉల్ హకీ అక్కడి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. ఎందుకు అనే విషయాన్నికొస్తే.. ఈ సినిమా తెలుగులో గనుక రిలీజ్ అయితే మాట ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, ఈ చిత్రం చరిత్రకు సంబంధం లేకుండా 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా చిత్రీకరించారని వారు తెలిపారు. దీంతో ఉత్తర భారత దేశంలో జరిగినట్టే ఇక్కడ కూడా గొడవలు జరుగుతాయని, అందుకే తెలుగు రిలీజ్ ని ఆపాలని కూడా వారు కోరుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
పబ్లిసిటీ కోసమేనా..?
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా ఉట్టిదేనని.. పబ్లిసిటీ స్టంట్ కోసమే నిర్మాత బన్నీ వాసు ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
ఛావా సినిమా విశేషాలు..
ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal) శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా నటించి ఒదిగిపోయారు. ఇక ఆయన భార్య యేసు భాయి పాత్రలో నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utkar ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఇందులో అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు భారీ విజయాన్ని అందించింది. ఇకపోతే రూ.130 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు .ఇక బాలీవుడ్ రూ.1000 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.