Man Kisses Passenger On Train | రైలు ప్రయాణంలో ఒక వ్యక్తి తన సీటులో నిద్రపోతుండగా.. మరో ప్రయాణికుడు అక్కడికి వచ్చాడు. ప్రయాణంలో ఉన్న ట్రైన్ లో అలా సాధారణంగా అయితే కూర్చోడానికి స్థలం కావాలనో లేదా ఏదైనా సాయం కోసమో అపరిచితులైనా తోటి ప్రయాణికులు కావడంతో సమీపంగా వస్తారు. కానీ యువకుడు మాత్రం ఎవరూ ఊహించనది చేశాడు. నిద్రపోతున్న ఒక పురుషుడిని ఈ యువకుడు గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. దీంతో నిద్రపోతున్న వ్యక్తి ఒక్కసారిగా లేచాడు. తనను ఒక పురుషుడు ముద్దు పెట్టుకున్నాడని చూసి షాకైపోయాడు. ఇదంతా అక్కడ చుట్టు పక్కల ఉన్నవారంతా చూస్తూ ఉండగానే జరిగింది.
దీంతో ఆ నిద్రలేచిన ప్రయాణికుడు వెంటనే తన వద్ద ఉన్న కెమెరాతో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినవారంతా “మన సమాజం ఎటు వెళుతోంది?, మగవారికే ఈ మృగాల నుంచి భద్రత లేకుంటే మహిళకు రక్షణ ఉంటుందా?” అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read: పెళ్లైన రెండో రోజు వధువు ప్రసవం.. వరుడి షాకింగ్ నిర్ణయం..
రైలు ప్రయాణంలో రికార్డ్ అయిన ఆ వీడియోలో బాధితుడు స్వయంగా వీడియోతో మాట్లాడుతూ.. ‘నేను ట్రైన్ లో నా సీటుపై నిద్రపోయి ఉన్నాను. ఆ సమయంలో ఈ వ్యక్తి (నిందితుడిని చూపిస్తూ) బలవంతంగా నన్ను అందరిముందు ముద్దుపెట్టుకున్నాడు. ‘నేను అతడిని ప్రతిఘటిస్తే.. నాకు నచ్చింది అందుకే నేను చేశాను.’ సమాధానమిచ్చాడు. నేను అతడిని పట్టుకోబోతే.. అతడి భార్య అక్కడికి వెంటనే వచ్చేసింది. “నా భర్తను వదిలేయ్.. పోనీలే.. పెద్ద సమస్య కాదుగా” అంటూ అతడిని సమర్థిస్తోంది. కానీ నేను మాత్రం అతడిని వదలను. చుట్టూ ఉన్నవారంతా మౌనంగా చూస్తున్నారు. నా స్థానంలో ఒక మహిళ ఉంటే అలాగే చేస్తారా? ఇలాగే ఆ వ్యక్తి భార్యతో ఎవరైనా చేస్తే అతను మౌనంగా ఉంటాడా? చూడండి ఇక్కడ ఎంత మంది నిలబడి ఉన్నారో? వారంతా ఇది చూశారు. అయినా నోరు విప్పడం లేదు. వారందరినీ పోలీసులకు ఫోన్ చేయండని విన్నవించుకున్నాను ” అని చెప్పాడు. ఇంతలోనే ఆ నిందితుడు కలుజేసుకొని.. “ఏదో పొరపాటు జరిగిపోయింది.” అని అన్నాడు.
అంతే నిందితుడిని పట్టుకొని కొట్టేందుకు బాధితుడు ప్రయత్నించాడు. కానీ మళ్లీ మధ్యలోనే అతని భార్య అడ్డుకుంది. తన భార్యను కాపాడే క్రమంలో ఏడుస్తూ వదిలేయమని కోరింది. అయినా బాధితుడు ఆ అసభ్య యువకుడిని పట్టుకొని చెంపదెబ్బలు కొట్టాడు. ఈ వీడియోలో అసభ్య పదజాలం ఉండడంతో వీడియోని పబ్లిష్ చేయడం లేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసినవారంతా ఇది ఏ మాత్రం అంగీకరించలేమని అభిప్రాయపడుతున్నారు. బాధితుడికి న్యాయం జరగాలని చెబుతున్నారు. పబ్లిక్ స్థలాల్లో సామాన్య ప్రజలు ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోందని.. సమాజంలో పురుషులు కూడా సేఫ్ గా లేరని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా వీడియో పోస్ట్ చేసిన బాధితుడిని మెచ్చుకుంటున్నారు. కొందరైతే 139కి కాల్ చేయండని సూచిస్తున్నారు.