BigTV English

Allu Arjun vs Pawan Kalyan : కూటమికే కాదు మెగా కంపౌండ్‌కీ పోటు తప్పదా… అల్లు అర్జున్ షాకింగ్ డిసిషన్..?

Allu Arjun vs Pawan Kalyan : కూటమికే కాదు మెగా కంపౌండ్‌కీ పోటు తప్పదా… అల్లు అర్జున్ షాకింగ్ డిసిషన్..?

Allu Arjun vs Pawan Kalyan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్షాల మధ్య నడుస్తున్న బ్రేకింగ్ పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే మధ్యలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సరిగ్గా అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టబోతుండడం సంచలనంగా మారింది. దీంతో అల్లు అర్జున్ (Allu Arjun) రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది.


చాలాకాలంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకోవాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అనే టాగ్ ను తీసేసి సొంత కాళ్ళపై నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ను తీసి పక్కన పారేసి, ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేసులో దూసుకెళ్లాడు. తన టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే చాలా ఈవెంట్లలో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఇక రీసెంట్ గా జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాడని అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ తీసుకున్న షాక్ కి గురి చేసింది. ఆయన కూటమికి లేదా మామ పవన్ కళ్యాణ్ గా కాకుండా ఏకంగా అపోజిషన్ పార్టీ వైసిపి లీడర్ కి సపోర్ట్ చేశాడు. దీంతో అప్పట్లో ఒక్కసారిగా ఈ విషయం దుమారాన్ని రేపింది. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, సాయి తేజ్ లాంటి హీరోలు ప్రయత్నించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా నంద్యాలకు వెళ్లి మరీ వైసిపి పార్టీ లీడర్ కి తన సపోర్ట్ ని ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఏదో ఒక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, అల్లు అర్జున్ రూటు సపరేట్ గా ఉండబోతోంది అనిపించేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు.


రీసెంట్ గా అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కనిపించలేదు. కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు వైసిపి లీడర్ శిల్పా రవి రెడ్డి స్నేహ రెడ్డి బర్త్ డే పార్టీకి వెళ్లడం చూసాం మనం. ఇక ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ (Allu Arjun) ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అన్న వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. దానికి కారణం ప్రస్తుతం అధికార, విపక్ష పార్టీల మధ్య నడుస్తున్న బ్రేకింగ్ పోస్టులు. తాజాగా xలో టిడిపి, వైసిపి మధ్య బిగ్ బ్రేకింగ్ లో యుద్ధం నెలకొంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఓ బిగ్ ఎక్స్ పోజ్ అంటూ టిడిపి పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వచ్చిన కాసేపట్లోనే కౌంటర్ గా అదే టైంకి బిగ్ రివీల్ అంటూ వైసీపీ పోస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో అదే టైంకి అల్లు అర్జున్ (Allu Arjun) ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయన వైసిపికి సపోర్ట్ చేస్తూ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడని, డైరెక్ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ కి షాక్ ఇవ్వనున్నాడని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ వార్తలు కనక నిజమైతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ ఆపోజిషన్ గా నిలవబోతున్నాడు అనేది తేటతెల్లమవుతుంది. కాగా మరోవైపు అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ లో ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమాలకు సంబంధించి ఉంటుందా ? లేదంటే పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఆయన ఏమైనా మాట్లాడతారా అనేది చూడాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×