BigTV English

Sri Murali: ప్రశాంత్ నీల్ మొదటి హీరో.. నెల్లూరు అల్లుడని తెలుసా.. ?

Sri Murali: ప్రశాంత్ నీల్ మొదటి హీరో.. నెల్లూరు అల్లుడని తెలుసా.. ?

Sri Murali: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి తెలుగు  ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజిఎఫ్ సినిమాతో  ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన ఈ డైరెక్టర్ సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా  తెరకెక్కిన సలార్ గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్.. ఆయనను ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు. ఆ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్  అని చెప్పాలి.


ఇక ప్రస్తుతం ఎన్టీఆర్  31 సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం గుర్తుందా.. ? ఈ సినిమా కన్నడలో మంచి విజయాన్ని అందుకుంది. శ్రీ మురళీ హీరోగా  తెరకెక్కిన ఈ చిత్రంతోనే ప్రశాంత్ నీల్ తన కెరీర్ ను మొదలుపెట్టాడు.  ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ బావనే శ్రీమురళీ. నెల్ చెల్లెలు దివ్యను ప్రేమించి పెళ్లాడాడు. తన మొదటి సినిమాలో బావనే హీరోగా ఎంచుకొని, అతడికి భారీ హిట్ ను అందించాడు.

Allu Arjun vs Pawan Kalyan : కూటమికే కాదు మెగా కంపౌండ్‌కీ పోటు తప్పదా… అల్లు అర్జున్ షాకింగ్ డిసిషన్..?


ఇక  చాలా గ్యాప్  తరువాత  వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. అదే బఘీర.  ఉగ్రం సినిమాతో యాక్షన్ హీరోగా మారిన  శ్రీమురళీ.. ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్  నీల్ దర్శకత్వం చేయకపోయినా కథను అందించాడు.  డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీమురళీ సరసన రుక్మిణీ వసంత్ నటిస్తోంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకొనేలా చేసింది.

ఇక ఈ సినిమా అన్ని భాషల్లో అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో  ప్రమోషన్స్  మొదలుపెట్టిన శ్రీమురళీ.. తెలుగులో కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఆయన చక్కగా తెలుగు మాట్లాడడం చూసి అందరు షాక్ అవుతున్నారు. కన్నడ నటుడు తెలుగు అంత పర్ఫెక్ట్ గా ఎలా మాట్లాడుతున్నాడా.. ? అని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.  అదేంటంటే.. ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయిది నెల్లూరు అంట.  భార్య కోసం శ్రీమురళీ తెలుగు నేర్చుకున్నాడట. ఆ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

Jai Hanuman : “జై హనుమాన్” పై ప్రశాంత్ వర్మ హింట్… దీపావళికి తీపి కబురు

”  మా అత్తగారిది నెల్లూరు.  ఎప్పుడు ఇంటికి వచ్చినా నా భార్య, అత్తగారు తెలుగులో మాట్లాడుకుంటారు. వారి కోసం నేను కూడా తెలుగు నేర్చుకున్నాను. కెరీర్ మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. ఉగ్రం సినిమా నా జీవితాన్ని మార్చేసింది. మొదట్లో నేను చాలా తప్పులు చేశాను. వాటిని ఇప్పుడు సరిద్దిదుకోవాలనుకుంటున్నాను. బఘీర ను ఎంతో కష్టపడి  తెరకెక్కించాం. తప్పకుండ అందరికి నచ్చుతుంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×