BigTV English

Yoga For Concentration: మీ ఏకాగ్రతను పెంచే యోగాసనాలు ఇవే !

Yoga For Concentration: మీ ఏకాగ్రతను పెంచే యోగాసనాలు ఇవే !

Yoga For Concentration: యోగా అనేది శరీరానికి ఒక అద్భుతమైన ఔషధం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కోసం మనం వ్యాయామం చేసినట్లే మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి, మనస్సును పదునుగా ఉంచడానికి యోగా చేయడం చాలా ముఖ్యం.


మీ మెదడు వేగంగా పని చేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి కొన్ని ప్రత్యేకమైన యోగా ఆసనాలు ఉపయోగపడతాయి. మరి రోజు యోగా చేయడం వల్ల కలిగే లాభాలు. ఏ యోగాసనాలు చేస్తే ఏకాగ్రత పెరుగుతుందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శీర్షసనం:


మెదడు యొక్క శక్తిని పెంచడానికి శీర్షాసనం అత్యంత ప్రభావవంతమైన ఆసనంగా పరిగణించబడుతుంది. ఈ ఆసనంలో తలకిందులుగా నిలబడి తలపై బ్యాలెన్స్ ఉంచడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మెదడుకు మరింత ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

పశ్చిమోత్తనాసనం:

పశ్చిమోత్తనాసన యోగాసనాన్ని చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ ఆసనంలో, శరీరం ముందుకు వంచి ఉంటుంది. అందుకే ఇది మెదడు యొక్క నరాలను సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం మెదడు కణాలకు విశ్రాంతినిచ్చి వాటికి తాజాదనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

సర్వంగాసనం:

సర్వాంగాసనం చేస్తున్నప్పుడు, శరీర సమతుల్యత భుజాలపై ఉంటుంది. ఈ ఆసనం సమయంలో, తల క్రిందికి, కాళ్ళు పైకి ఉంటాయి. దీని కారణంగా మెదడులో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఈ ఆసనం మనస్సుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మానసిక అలసట, ఆందోళనను తొలగిస్తుంది.

Also Read: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

ప్రాణాయామం:
యోగాసనాలు, ప్రాణాయామం క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మెదడు వేగంగా పని చేయడానికి ,ఒత్తిడి లేకుండా ఉండటానికి పైన తెలిపిన ఆసనాలను చేయండి. ఈ యోగాసనాలతో, మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ధ్యాస సామర్థ్యం పెరుగుతుంది. మీ మనస్సు తాజాదనంతో నిండి ఉంటుంది. మీ మనస్సును చురుకుగా ఉంచడానికి యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×