Pushpa Raj : పుష్ప రాజ్ (Pushpa Raj) .. ఈ ఒక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో విడుదలైన పుష్ప (Pushpa) సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘తగ్గేదేలే’ అనే సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయంగా ఈ సిగ్నేచర్ స్టెప్ తో చాలామంది వీడియోలు కూడా షేర్ చేశారు. ఇక ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప2’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది.
పుష్పరాజ్ గెటప్ తో భారీ గుర్తింపు..
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మేనరిజం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆయన గెటప్ లోనే ఒక వ్యక్తి మహా కుంభమేళాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రయాగరాజ్ లో 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహాకుంభమేళాలో పుష్పరాజ్ గెటప్ లో ఒక వ్యక్తి కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడి అధికారులను సైతం మెప్పించాడు. ఇక ఇప్పుడు ఇతను బన్నీ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇతను నార్త్ స్టేట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇతడిని చూసిన తెలుగు ఆడియన్స్ కూడా అల్లు అర్జున్ అనుకుంటున్నారా? ఏంటి? ఇతడి కోసం ఇంతమంది వస్తున్నారు అంటూ కూడా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
రాజకీయంగా కూడా పెరిగిన పలుకుబడి..
పైగా ఇతడిని రాజకీయ పార్టీలు బాగా వాడుకుంటున్నాయి. దీనికి తోడు బీజేపీ లీడర్ నవనీత్ కౌర్ (Navneet Kaur)తో ఉన్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్స్ కి , ఈవెంట్స్ కి ఇతడిని గెస్ట్ గా పిలుస్తున్నారు. ఇతడు ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు తెలియడం లేదు. కానీ పుష్ప రాజ్ గెటప్ లో భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మొత్తానికి అయితే బన్నీ పుణ్యమా అని ఇతడికి రాజకీయంగా కూడా పలుకుబడి పెరుగుతోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇతడు ఎవరు? ఇతడి బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియోలో ఏముందంటే..?
ఇక ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉండగా నవనీత్ కౌర్ తో పాటు ఇతడు కూడా విచ్చేశాడు. ఇక అక్కడ క్రికెట్లో గెలిచిన వారికి నవనీత్ కౌర్ కాకుండా ఇతడి చేతుల మీదుగా కప్పు ప్రెసెంట్ చేయడం జరిగింది . ఆ తర్వాత అల్లు అర్జున్ మేనరిజంతో అక్కడ కొన్ని స్టెప్స్ వేసి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Bhai ki kuda intha fandom vundadhu amo ra 📈😭 pic.twitter.com/6c3MEnCSZd
— x_tweet's 🌅 (@MididoddiSai1) March 6, 2025