Chiranjeevi – anil ravipudi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి అని మినీ రాజమౌళి అని కూడా కొందరు అంటూ ఉంటారు. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో ఈ సినిమాతోనే మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ కెరీయర్లో ముందుకు వెళ్ళాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అనిల్ కెరియర్ లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. అలా అని కల్ట్ క్లాసిక్ అంటూ కూడా లేదు. కానీ అనిల్ రావిపూడి చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరుత్సాహపరచలేదు. రీసెంట్గా వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచి మంచి లాభాలను దిల్ రాజు ఖాతాలో వేసింది.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి సినిమా చేస్తారు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసింది. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 90 రోజులు డేట్స్ ను అనిల్ రావిపూడి కి కేటాయించారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ కానుంది. అక్టోబర్ నెల కల్లా ఈ సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతిసారి మంచి సక్సెస్ సాధించాయి. ఎఫ్2 గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతి కానుక రిలీజ్ అయింది. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు అనిల్.
సినిమా అంటే కేవలం వినోదం అని నమ్మే అతి తక్కువ మంది దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. చాలా సందర్భాల్లో అనిల్ రావిపూడి కూడా మాట్లాడుతూ నాకు తెలిసిన సినిమా ఇదే అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా అంటే హాలీవుడ్ స్థాయిని అందుకోవలసిన అవసరం లేదు. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ని ఆనందపరిస్తే చాలు అని నమ్మే బలమైన దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమాను ఎంత బాగా తీస్తాడో అంతే బాగా ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో కూడా అనిల్ రావిపూడి కీలక పాత్ర పోషిస్తాడు. అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్టంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇక చిరంజీవి సినిమాకి ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు, చిరంజీవి సినిమా అంటేనే ఒక పెద్ద పబ్లిసిటీ.
Also Read : Movie Theatres : థియేటర్‌లోకి పూల కుండీల ఎంట్రీ లేదు… పాపం ఫ్యాన్స్