Bihar Crime: బీహార్ లోని నలంద జిల్లా బహుదాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశారు. యువతి పాదాలకు దాదాపు పది మేకులు, కుడిచేతిపై కూడా దుండగులు సూదితో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం యువతిని హాస్పటిల్‌కి తరలించారు పోలీసులు. డాగ్స్‌తో కూడా పరిశర ప్రాంతాలను ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో ఈ ఘటన జరగడంతో.. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఏమానా ఉందా ? లేక వ్యక్తిగత కారణాల వల్ల హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.