BigTV English

Allu Arjun : భారత్ – పాక్ మధ్య వార్.. పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు..?

Allu Arjun : భారత్ – పాక్ మధ్య వార్.. పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు..?

Allu Arjun : భారత దేశంలో నిన్న జరిగిన టెర్రరిస్ట్ ల అట్టాక్ యావత్ ప్రజానికాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జమ్మూ కాశ్మీర్లో కుటుంబాలతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన వాళ్లకి ఉగ్రవాదులు కన్నీళ్లను మిగిల్చారు. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఖండిస్తున్నారు. ఇది ఊహించని మారణకాండ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. ఈ ఘటన భై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉగ్రవాదులను మట్టు పెట్టాలని ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు.. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా దీనిపై ఖండించారు. గతంలో ఈయన మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూసేద్దాం..


పర్యాటకుల పై విరుచుకు పడ్డ ఉగ్రమూకలు..

భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అంటే మరో స్విట్జర్ల్యాండ్ అని అందరూ నమ్ముతారు. సమ్మర్ వెకేషన్స్ కు చాలా మంది ఇక్కడికి వెళ్తారు. భూతల స్వర్గం బైసరన్ లోయలో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి పేర్లు కనుక్కుని మరి దారుణంగా హతమార్చారు. దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యాబిడ్డల ఎదురుగానే భర్తలను ముష్కరులు కాల్చేశారు. కొత్తగా పెళ్లయి హనీమూన్‌కి కాశ్మీర్ వచ్చిన వారికి కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఘోర విషాదాన్ని మిగిల్చారు.. పసి హృదయాలకు తండ్రీని దూరం చేసారు. భారత్‌పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయగా.. భారత్‌లోని పాకిస్తాన్ జాతీయులు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.. పాకిస్తాన్ మీసాలను కూడా రద్దు చేసింది. భారత్ కి సపోర్ట్ గా అన్ని దేశాలు నిలబడ్డాయి. ఏ క్షణమైనా భారత్ విరుచుకుపడుతుందని పాక్ గజగజ వనికి పోతుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గతంలో చెప్పిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఉగ్రవాదుల పై అల్లు అర్జున్ వ్యాఖ్యలు..

2018 మే లో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా..అప్పట్లో నా పేరు సూర్య ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత సైన్యం గురించి యుద్దాల గురించి గొప్పగా మాట్లాడాడు అల్లు అర్జున్. ఒకవేళ భారత సైన్యంలో చేరాలని కుట్టే ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని బన్నీ అంటున్నాడు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని, వెళ్లనా? వద్దా? అని అడిగానని అల్లు అర్జున్ తెలిపారు. అక్కడికి  డ్రెస్ వేసుకుని బయటికెళ్లి మార్చ్ ఫాస్ట్ చేయడం కాదని, బోర్డర్‌కి వెళ్లాల్సి వస్తుందని అన్నాను అని అల్లు అర్జున్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెట్జన్లో అల్లు అర్జున్ ఎక్కడున్నావ్? ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది యుద్దానికి రెడీ అవ్వు అని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×