OTT Movie : బాలీవుడ్ సినిమాలకు మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులుగా ఉన్నారు. సినిమాలను చూడటానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. పెళ్లి కానీ ప్రెగ్నెంట్ అమ్మాయిలను ఇతడు టార్గెట్ చేస్తుంటాడు. చివరివరకు సస్పెన్స్ తో, ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ తో స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ (Mrs Serial Killer). 2020 లో విడుదలైన ఈ సినిమాకి శిరీష్ కుందర్ దర్శకత్వం వహించారు. అతని భార్య ఫరా ఖాన్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మనోజ్ బాజ్‌పేయి, మోహిత్ రైనా ప్రధాన పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్ మేనకోడలు, జైన్ మేరీ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో జాక్వెలిన్ టైటిల్ రోల్ పోషించింది. ఈ మూవీ మే డే సందర్భంగా మే 1, 2020 న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ గా డాక్టర్ మృత్యుంజోయ్ విధులు నిర్వహిస్తుంటాడు. అయితే ఇతను ఆరుగురు గర్భవతులైన, పెళ్ళికాని యువతుల హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. అతని భార్య సోనా ముఖర్జీ, తన భర్త నిర్దోషి అని గట్టిగా నమ్ముతుంది. అతన్ని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ కేసును విచారిస్తున్న ఇన్‌స్పెక్టర్ ఇమ్రాన్ షాహిద్, సోనా మాజీ ప్రియుడు, తన భర్తను ఇరికిస్తున్నారని సోనా అనుమానిస్తుంది. సోనా ఒక ప్రముఖ న్యాయవాది బ్రిజ్ రస్తోగి సహాయం తీసుకుంటుంది. అతను సోనాకు ఒక భయంకరమైన సలహా ఇస్తాడు. మృత్యుంజోయ్ జైలులో ఉన్నప్పుడు మరో హత్యను అదే విధంగా చేసి, సీరియల్ కిల్లర్ ఇంకా బయట ఉన్నాడని నిరూపించమని సలహా ఇస్తాడు. సోనా తన పొరుగున ఉండే, అనుష్కా తివారీ అనే పెళ్ళికాని గర్భవతి అమ్మాయిని టార్గెట్ చేస్తుంది. కానీ తను ఆమెను హత్య చేయకుండా, ఒక గుర్తు తెలియని శవాన్ని అనుష్కా శరీరంలా సిద్ధం చేసి, అనుష్కాను ఒక చోట బంధిస్తుంది.
ఈ కొత్త హత్య కారణంగా మృత్యుంజోయ్ కు బెయిల్ వస్తుంది. అయితే, అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అనుష్కాను క్లినిక్ బేస్‌మెంట్‌లో బంధించి ఉంచిన విషయం అతనికి చెబుతుంది సోనా. ఆ తరువాత ఇంట్లో మృత్యుంజోయ్ కనిపించకపోవడంతో, సోనా క్లినిక్‌కు వెళ్తుంది. అక్కడ జోయ్, అనుష్కాను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు సోనాకు నిజంగా ఆ ఆరుగురు అమ్మాయిలను, చంపిన సీరియల్ కిల్లర్ మృత్యుంజోయ్ అని తెలుస్తుంది. అతని తల్లి పెళ్లి కాకుండా గర్భం దాల్చి అతన్ని వదిలేసిందని, అందుకే పెళ్ళికాని గర్భవతులపై అతనికి పగ ఉందని వెల్లడిస్తాడు. సోనా, అనుష్కాను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ జోయ్ ఆమెను గాయపరుస్తాడు. చివరికి సోనా, అనుష్కా, మృత్యుంజోయ్ నుంచి బయట పడతారా ? మృత్యుంజోయ్ ని పోలీసులు పట్టుకుంటారా ? అతనికి శిక్ష పడుతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రాజకీయాలలో అబద్ధాల హరిశ్చంద్రుడు … పొట్ట చెక్కలయ్యేలా ఉందయ్యా ఈ సిరీస్ ని చూస్తే