Amaran Twitter Review : తమిల హీరో శివ కార్తికేయ సినిమాల గురించి అందరికీ తెలుసు.. తమిళ సినిమాలు తెలుగు కూడా డబ్ చేయబడ్డాయి. అందుకే ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. ఈయన గతంలో నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో కొత్త సినిమాతో ఇవాళ ప్రేక్షకులను పలకరించాడు. ఈరోజు ఈయన నటించిన అమరన్ మూవీ దీపావళి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో తమిళం, తెలుగులో పాటు మిగిలిన భాషల్లో రిలీజైంది. తమిళ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ గురువారం పాన్ ఇండియన్ లెవెల్‌లో తమిళం, తెలుగులో పాటు మిగిలిన భాషల్లో రిలీజైంది..దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించాడు. సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌తో పాటు భారీ ప్రమోషన్స్ కారణంగా అమరన్‌పై తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఏంటో చూద్దాం..
మొన్నటివరకు శివకార్తికేయన్ లవర్‌బాయ్‌గా, పక్కింటి కుర్రాడి తరహా సాఫ్ట్ రోల్స్ ఎక్కువగా చేశాడు. వాటికి భిన్నంగా ఆర్మీ మేజర్ పాత్రలో మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.వార్ బ్యాక్‌డ్రాప్ సీన్స్‌ను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు అమరన్ మూవీలో చూపించాడని అంటున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ కన్నీళ్లను పెట్టిస్టుందని, ఆ సీన్‌లో సాయిపల్లవి తన యాక్టింగ్‌తో ఇరగదీసిందని చెబుతోన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమా ప్లస్ పాయింట్‌గా నిలిచిందని చెబుతోన్నారు..
అలాగే మరో నెటిజన్ రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి క్యారెక్టర్, యాక్టింగ్ అమరన్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్‌గా నెటిజన్లు ట్వీట్స్ చేస్తోన్నారు. శివకార్తికేయన్, సాయిపల్లవి కాంబోలో వచ్చే ప్రతీ సీన్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా పండిన మూవీ ఇదే అంటూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ బాండింగ్ సీన్స్, వాటి నుంచి వచ్చే ఫన్ అలరిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. మొత్తానికి సినిమాకు పాజిటివ్ టాక్ ను అందుకుంది. నెటిజన్ల నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
So far, we have seen @Siva_Kartikeyan buddy as fun, family, drama and next door boy type of acting and entertaining but first time, so happy and heartwarming to see him as in such a matured and loaded character. And SK is growing up as a matured actor. Bright future 👏🏼👏🏼. Great…
— Karthik (@meet_tk) October 30, 2024
#AmaranReview
First half 💥💥💥💥What a transformation @Siva_Kartikeyan 👏🏻👏🏻👏🏻👏🏻 Action, Love, family bond all areas awesome 🔥🔥🔥
Excellent 👉🏻 Photography 👉🏻 Music pic.twitter.com/HtGj4qjle3
— R 🅰️ J (@baba_rajkumar) October 31, 2024