Peddi Movie: రామ్ చరణ్ (Ramcharan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన (Bucchi Babu Sana)దర్శకత్వంలో “పెద్ది” (Peddi)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇటీవల రాంచరణ్ నటించిన సినిమా పెద్దగా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో పెద్ది పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
అర్జున్ అంబటి…
ఇక ఈ సినిమాలో పలువురు నటీనటులు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి(Arjun Ambati) కూడా ఒకరు. ఈ సినిమాలో అర్జున్ అంబటి ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన కూడా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అర్జున్ అంబటి బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో కంటిస్టెంట్ గా కొనసాగుతున్న సమయంలో ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదిక పైనుంచి తనకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
నేషనల్ అవార్డు గ్యారెంటీ…
ఇలా రాంచరణ్ సినిమాలో అవకాశమందుకున్న అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు పెద్ద సినిమా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. పెద్ది సినిమా గురించి ఏ విషయాలు నేను బయటకు చెప్పకూడదని తెలిపారు. అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు (National Award)సినిమా అంటూ హైప్ పెంచేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి అంచనాలను పెంచేస్తుందని, ఈ టీజర్ దృష్టిలో పెట్టుకొని సినిమాని కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబుకు ఉప్పెన సినిమాతోనే మంచి అవార్డులను సొంతం చేసుకున్నారు.
చరణ్ కెరీర్ కు కీలకం…
ఇక పెద్ది సినిమా ద్వారా రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావడం పక్కా అంటూ ఈయన సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా గడుపుతున్నారు. రామ్ చరణ్ కెరియర్ కు ఈ చిత్రం ఎంతో కీలకమని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన RRR సినిమా తర్వాత గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పెద్ది సినిమా రామ్ చరణ్ సక్సెస్ కు కీలకంగా మారిందని చెప్పాలి.