Ahmedabad plane crash: విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
విమానం ప్రమాదం జరిగిన చోట బ్లాక్ బాక్స్ దొరికింది. రెస్క్యూ ఆపరేషన్ కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రస్తుతం దీనిపై డీకోడ్ చేస్తున్నారు. హైలెవల్ కమిటీతో అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. నివేదక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రమాదం జరిగే చివరి క్షణంలో పైలట్ మే డే కాల్ చేశారు.’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.
ఘటన జరిగిన వెంటనే పౌర విమానయాన శాఖ స్పందించింది. ప్రమాద జరిగిన స్థలం నుంచి మృతదేహాలను మృతదేహాలను తరలించాం. విమాన ప్రమాద ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్ గా తీసుకుంది. కమిటీలో అవసరం అయితే మరికొంత సభ్యులను చేరుస్తాం. నిన్న సాయంత్రం సంఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ దొరికింది. దానిని పూర్తి విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుస్తాయి. బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకోవడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని కేంద్రం మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హోం శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్స్ తో.. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాట్లు స్పష్టం చేశారు. కమిటీని త్వరలోనే కలుస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ కమిటీ సభ్యులు దోహదపడుతారని అన్నారు. నిపుణుల విచారణ పూర్తి అయ్యాక.. సరైన సమయంలో మీడియాకు సమాచారం అందిస్తామని ఆయన చెప్పారు. రెండు నెల్లో విచారణ కంప్లీట్ అవుతోందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే బోయింగ్ 787 సిరీస్ ను తరుచూ తనఖీలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
ALSO READ: Ahmedabad Plane Crash: నా తండ్రి కూడా ప్రమాదంలోనే.. ఆ బాధ ఏంటో నాకు తెలుసు: రామ్మోహన్ ఎమోషనల్
ఎయిర్ పోర్టు నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత.. 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే విమానం కూలిపోయినట్టు పౌరవిమానయాన శాఖ కార్యదర్శి తెలిపారు. అహ్మదాబాద్ ఏటీసీకి పైలట్ మేడే కాల్ ఇచ్చారని ఆయన చెప్పారు. విమాన సిబ్బందిని ఏటీసీ సంప్రదించినా రియాక్షన్ రాలేదని అన్నారు. ప్రమాదం జరిగన క్షణాల్లోనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. 2 గంటల్లో ఉన్నతాధికారుల బృందమంతా ఘటనాస్థలికి చేరుకుందని.. గుజరాత్ ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిందని అన్నారు. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం 6 గంటల వరకు అగ్నిమాపక శాఖ మంటలను పూర్తిగా ఆపేసింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.