Cheese Side Effects: చీజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడే ఒక రుచికరమైన పాల ఉత్పత్తి. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ చీజ్‌ను అధికంగా తిన్నా లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తినడం వల్ల కొన్నిసైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వాటి గురించి తెలుగించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లాక్టోస్ :
చీజ్‌లో సహజంగా లాక్టోస్ ఉంటుంది. ఇది పాలలో ఉండే ఒక చక్కెర. చీజ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే.. చీజ్‌లో లాక్టోస్ కంటెంట్ పాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
బరువు పెరగడం (Weight Gain):
చీజ్‌లో కొవ్వు (Fat కేలరీలు (Calories) అధికంగా ఉంటాయి. ఒక చిన్న ముక్క చీజ్‌లో కూడా ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. రుచిగా ఉంటుంది కాబట్టి.. తెలియకుండానే ఎక్కువ తినే అవకాశం ఉంది. అధికంగా కేలరీలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఊబకాయం (Obesity) ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, చీజ్‌ను మితంగా తీసుకోవడం ముఖ్యం.
సోడియం అధికంగా ఉండటం :
చాలా రకాల చీజ్‌లలో సోడియం (ఉప్పు) అధికంగా ఉంటుంది. సోడియం శరీరంలో ద్రవ సమతుల్యతకు ముఖ్యమైనదే అయినప్పటికీ, అధికంగా సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (High Blood Pressure) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు (Heart Disease)స్ట్రోక్ (Stroke) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా సోడియం ఎక్కువగా ఉండే చీజ్‌ను తినకుండా ఉండటం మంచిది.
సంతృప్త కొవ్వు (Saturated Fat):
చీజ్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL Cholesterol) స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు చీజ్‌ను మితంగా తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉండే చీజ్ రకాలను ఎంచుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయం.
తలనొప్పి లేదా మైగ్రేన్ (Headaches or Migraines):
కొంతమంది వ్యక్తులు చీజ్ తినడం వల్ల తలనొప్పి లేదా మైగ్రేన్ల వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి కారణం చీజ్‌లో ఉండే టైరామిన్ (Tyramine) అనే సమ్మేళనం. టైరామిన్ అనేది కొన్ని ఆహారాలలో కనిపించే ఒక సహజ అమైనో ఆమ్లం. ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
Also Read: వీళ్లు.. కివీ ఫ్రూట్ అస్సలు తినకూడదు తెలుసా ?
మలబద్ధకం (Constipation):
చీజ్‌లో ఫైబర్ (పీచు పదార్థం) తక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ చీజ్ తిని, దానికి తగ్గట్టుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోతే ఈ సమస్యలు తలెత్తుతాయి