Ambati Rambabu: పుష్ప సినిమాను ఎవరూ అడ్డుకోలేరని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. అరచేతిని అడ్డు పెట్టుకుని పుష్పను ఆపలేరని చెప్పారు. ఆ సినిమా చూడకుండా ఆపే సత్తా ఎవరికీ లేదని తాను కూడా చూస్తానని వ్యాఖ్యానించారు. పుష్ప పార్ట్ 1 అద్భుతంగా ఉందని, అందుకే కొంతమందికి పుష్ప 2పై జెలసీగా ఉందని ఆశ్చర్యకర వ్యాఖ్యాలు చేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను బహిష్కరించాలని అనుకోవడం అవివేకమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
వైసీపీ కార్యకర్తలను ఐటీ యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై అసభ్య కామెంట్లు చేసిన వారిపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. టీడీపీ వాళ్లు అసభ్యకామెంట్లు చేసినా అరెస్ట్ చేస్తామని నీతి వ్యాఖ్యాలు చెప్పిన చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: జగన్ ఒక్కరే వైఎస్సార్ ఫ్యామిలీనా.. నేను నోరెత్తితే తల కూడా ఎత్తలేరు.. బాలినేని ఫైర్
రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి టీడీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగితే సరైన సమాధానం లేదని చెప్పారు. పోలీసులు స్పందించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, స్పీకర్ అయినా మంత్రి అయినా, సామాన్యుడు అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుందని అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
లోకేష్ కూడా జగన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆయనను అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసులు పెట్టారని, పోసాని కృష్ణ మురళి వైస్ జగన్ అభిమాని అన్నారు. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ ఆయనకు జగన్ పై ఉన్న ప్రేమను తొలగించలేరని వ్యాఖ్యానించారు. లోకేష్ రెడ్ బుక్ రాశాడని అదే ఆయనకు శాపంగా మారుతందని అన్నారు. రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.