Ameesha Patel..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా చేసిన ‘బద్రి’ సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు.అందులో ఒకరు రేణూ దేశాయ్ (Renu Desai), మరొకరు బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel).. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె తెలుగులో మహేష్ బాబు (Mahesh Babu)తో నాని(Nani), ఎన్టీఆర్ (NTR)తో నరసింహుడు (Narasimhudu), బాలకృష్ణ(Balakrishna)తో పరమ వీర చక్ర (Parama Veera Chakra) వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అమీషా పటేల్ మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఇక బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన అమీషా పటేల్, 50 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా కూడా.. ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ఆ మధ్యకాలంలో బిజినెస్ మాన్ అయినటువంటి కనవ్ పూరీ తో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరూ 2008లో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చాలా మీడియా సమావేశాలలో బయట పెట్టారు. అంతేకాదు తమ మధ్య మూడో వ్యక్తి కూడా రారు అంటూ అమీషా పటేల్ ఎన్నో ఇంటర్వ్యూలో తరచూ తమ బంధాన్ని అఫీషియల్ చేసేసింది.
అతడితో ప్రేమలో పడిందా..
ఆ తర్వాత కనవ్ పూరీ, అమీషా పటేల్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు కూడా కొన్ని వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తలను అమీషా పటేల్ కొట్టి పారేసింది. అయితే అలాంటి ఈ బ్యూటీ ఏమైందే ఏమో కానీ సడన్గా కనవ్ పూరీ తో విడిపోయింది. అయితే వీరిద్దరూ 2010లో విడిపోయినట్టు వార్తలు వినిపించాయి. పెళ్లి చేసుకుంటారనుకున్న జంట సడన్ గా విడిపోయింది. అయితే ఆ తర్వాత సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ వ్యక్తితో తరచూ కనిపిస్తోంది. ఇక ఆ వ్యక్తి అమీషా పటేల్ కంటే వయసులో చాలా చిన్నవాడు. దాదాపు 20 ఏళ్లు చిన్నవాడని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీలు ఎవరితో అయినా రిలేషన్ లో ఉంటే, కచ్చితంగా ఏదో ఒక విషయంలో బయట పడుతుంటారు. అలా అమీషా పటేల్ కూడా తనకంటే వయసులో చిన్నవాడైన నీరవ్ బిర్లా (Neerav Birla)తో డేటింగ్ లో ఉన్న సమయంలో అతనితో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి “నా డార్లింగ్ నీరవ్ తో లవ్లీ సాయంత్రం” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ఈ ఫోటో ఒక్కసారిగా నెట్టింట్లో సంచలనం సృష్టించడంతో పాటు అమీషా పటేల్ తనకంటే వయసులో దాదాపు 20 ఏళ్లు చిన్నవాడైన నీరవ్ బిర్లాతో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వినిపించాయి.
క్లారిటీ ఇచ్చిన నీరవ్..
దీంతో ఒక్కసారిగా అమీషా పటేల్ డేటింగ్ వార్తలు బీటౌన్ లో వినిపించాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ తాజాగా ఈ రూమర్ పై నీరవ్ బిర్లా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “చాలా మంది అమీషా పటేల్ కు నాకు మధ్య ఏదేదో జరుగుతుందని ఏవేవో వార్తలు రాసేస్తున్నారు.
కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే అమీషా పటేల్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరం ప్రేమలో పడలేదు ప్రేమించుకోవడం లేదు. మా నాన్న అమీషా పటేల్ చిన్నప్పటినుండి ఫ్రెండ్స్ కావడంతో అమీషా పటేల్ నాకు పరిచయమయ్యారు. అలాగే నేను దుబాయ్ లో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం అక్కడికి వెళ్లాను. ఆ మ్యూజిక్ ఆల్బమ్ లో అమీషా పటేల్ కనిపించబోతున్నారు. అలా ఆ టైంలో దిగిన మా ఫోటోని చూసి అందరూ ఏవేవో ఊహించుకున్నారు. కానీ మీ ఊహల్లో ఎలాంటి నిజం లేదు” అంటూ నీరవ్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. ఇక నీరవ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు. ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ, కహో నా ప్యార్ హై అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తెలుగులో కూడా రాణించింది. ఇక 2018లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమీషా పటేల్ 2023లో గదర్ -2 ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.
.