BigTV English

Amigos : స్టోరీ సూపర్.. ట్విస్టులు అదుర్స్.. కానీ అమిగోస్ ఎలా ఉందంటే..?

Amigos : స్టోరీ సూపర్.. ట్విస్టులు అదుర్స్.. కానీ అమిగోస్ ఎలా ఉందంటే..?

Amigos : బింబిసార సూపర్‌ హిట్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం అమిగోస్‌. టైటిల్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. బాలకృష్ణ సినిమాలోని పాటను అమిగోస్ లో రీమిక్స్ చేయడం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచింది. ఇలా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకుందా? సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారో తెలుసుకుందాం..


భారీ అంచనాల మధ్య విడుదలైన అమిగోస్ మూవీపై ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఫస్ట్‌ షో పడిన వెంటనే ఈ సినిమాపై రివ్యూలు ఇస్తున్నారు. అమిగోస్ ఎలా ఉందో ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. సినిమా బాగుందని కొందరు సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు, పోస్టు చేస్తున్నారు. మూవీ కాన్సెప్ట్‌ బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ట్విస్టులు మంచి కిక్కు ఇచ్చాయని అంటున్నారు.

మరికొందరు సోషల్ మీడియా యూజర్లు అమిగోస్ అంతగా ఆకట్టుకునే చిత్రం కాదని కామెంట్స్‌ చేస్తున్నారు. కథనం స్లోగా ఉందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ బాగుందంటున్నారు. ఈ సినిమాలోని మూడు పాత్రలు బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంమీద సినిమాపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది.


అమిగోస్‌ మూవీలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మ’ రీమిక్స్‌ సాంగ్ రిలీజ్ ముందే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. బాలకృష్ణ- దివ్యభారతి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ పాటకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది. ఆ పాటకు ఇళయరాజా అందించిన స్వరాల ప్రేక్షకులను మైమర్చిపోయేలా చేశాయి. అమిగోస్ లో కల్యాణ్‌రామ్‌, ఆషికా రంగనాథ్‌ మధ్య కెమిస్ట్రీ అదే రేంజ్ లో కుదిరిందని అంటున్నారు.

రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందిన అమిగోస్ మూవీలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×