BigTV English

Amitabh Bachchan: ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్..! ఆ పోస్ట్ అందుకే పెట్టారా?

Amitabh Bachchan: ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్..! ఆ పోస్ట్ అందుకే పెట్టారా?

Amitabh Bachchan Hospitalised


Amitabh Bachchan Hospitalised : అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఆయన ముంబై కోకిలాబెన్ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారని అంటున్నారు. అంతకుముందు 81 ఏళ్ల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆసక్తిగా మారింది. ఆయన ఆసుపత్రిలో చేరారని ఊహాగానాలు రావడానికి ముందు ‘కృతజ్ఞతతో ఎప్పటికీ’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆయన తన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో తన బ్లాగ్‌లో అదే విషయాన్ని వెల్లడించారు. శస్త్రచికిత్స కారణంగా తాను ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. తన పనిని కొనసాగించడంపై మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ ఇతర ఆరోగ్య సమస్యలతోనూ పోరాడుతున్నారు. ఆ విషయాలను మాత్రం ఆయన ఎక్కువగా ప్రస్తావించలేదు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తానని అన్నారు.


Also Read : రివ్యూ.. బాబీ సింహా, అనసూయ, ప్రేమ నటించిన రజాకార్ ఎలా ఉంది ?

అమితాబ్ బచ్చన్  ఇటీవల కొన్ని విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో  అభిమానుల వైపు చేతులు ఊపుతూ ఉన్నారు. వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ పలకరించారు. బిగ్ బీ ముంబైలో ఉంటే తన అభిమానులను కలుస్తూ ఉంటారు. కనీసం ప్రతి ఆదివారం తన ఇంటి బయట ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు చేతులు ఊపి పలకరిస్తారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×