BigTV English

Pocso Case on former cm Yediyurappa: మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు.. ఆయన ఏమన్నారంటే..?

Pocso Case on former cm Yediyurappa: మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు.. ఆయన ఏమన్నారంటే..?

Pocso Case on former cm YediyurappaPocso Case on former cm Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తనపైన నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. తన సహాయం కోరి వచ్చిన మహిళకు సాయం చేస్తే ఆమె తిరిగి తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన మీడియాతో వెల్లడించారు. అయితే దీని వెనుక రాజకీయ ఉద్దేశ ఉందా.. లేదా అనేది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఏం జరిగినా తాను చూసుకుంటానని తెలిపారు.


Pocso Case on former cm Yediyurappa: తనపై నమోదైన ఈ పోక్సో కేసు విషయంలో మాజీ సీఎం యడుయూరప్ప మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. “కొన్ని రోజుల క్రితం ఓ మహిళ నా ఇంటికి వచ్చింది. ఏదో సమస్య ఉందని ఏడ్చింది. నేను ఆమెను అడిగాను.. వెంటనే ఈ విషయంలో సాయం చేయాలని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. ఈ విషయంలో కమీషనర్ తనకు సహాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆమె నాగురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కూడా నేను పోలీస్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్ళాను. నిన్న పోలీసులు నాపై కంప్లైట్ ఫైల్ చేశారు. తరువాత ఏం జరుగుతుందో చూద్దాం. దీని వెనుక రాజకీయ కోణం ఉందని నేను చెప్పలేను” అని అన్నారు.

అయితే 81 ఏళ్ల వయస్సును యడియూరప్పపై లైంగిక వేధింపుల కింద సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2వ తేదీన సహాయం కోరి వెళ్తే తన 17 ఏళ్ల కూతురుని యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8తో పాటు.. ఐపీసీ సెక్షన్ 354A కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కేసులో నేర రుజువైతే ఆయనకు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడనుంది.


Also Read: Election Schedule : రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు

ఈ కేసు నమోదుపై ఆయన కార్యాలయం ఖండించింది. ఫిర్యాదు చేసిన మహిళ గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేసినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటుగా ఇప్పటివరకు వారు 53 ఫిర్యాదులు చేశారంటూ ఓ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఇంతకుమించి వివరాలు చెప్పలేనని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర అన్నారు. ఇది మాజీ సీఎంకు సంబంధించింది కనుక చాలా సున్నితమైన కేసు అని అన్నారు. కాగా, కర్ణాటక సీఎంగా యడియూరప్ప నాలుగు సార్లు చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Tags

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×