BigTV English

Razakar Movie Review : రివ్యూ.. బాబీ సింహా, అనసూయ, ప్రేమ నటించిన రజాకార్ ఎలా ఉంది ?

Razakar Movie Review : రివ్యూ.. బాబీ సింహా, అనసూయ, ప్రేమ నటించిన రజాకార్ ఎలా ఉంది ?


Razakar Movie Review(Tollywood movie reviews) : తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందించిన సినిమా రజాకార్. ఈ సినిమాలో చాలాకాలం తర్వాత సీనియర్ నటి ప్రేమ తెరపై కనిపించింది. అలాగే హీరోయిన్ వేదిక కూడా కీలక పాత్ర పోషించింది. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రమైన రజాకార్.. ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం.

సినిమా : రజాకార్


యాక్టర్స్ : బాబీ సింహా, అనసూయ, వేదిక, ఇంద్రజ, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, జాన్ విజయ్, దేవీ ప్రసాద్, తేజ్ సప్రు తదితరులు

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : కె.రమేష్ రెడ్డి

నిర్మాత : గూడూరు నారాయణరెడ్డి

రచన, డైరెక్షన్ : యాట సత్యనారాయణ

విడుదల తేదీ : 15/03/2024

Also Read : ప్రభాస్ ‘కల్కి 2898’లో మన టాలీవుడ్ యంగ్ హీరో!

కథ..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇంకా నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్ పాండే) ఏలుబడిలో ఉన్నప్పటి రోజులవి. దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను, సంస్థానాలను భారత్ లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అందుకు నిజాం ప్రభువు మాత్రం ససేమిరా అంటాడు. తమ వద్దనున్న రజాకార్లు అనే ప్రైవేటు సైన్యం సహకారంతో హైదరాబాద్ ను తుర్కిస్తాన్ అనే దేశంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అందుకు రజాకార్ల చీఫ్ ఖాసిం రిజ్వీ (Raj Arjun).. నాటి నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ (John Vijay) పెద్దకుట్రకు తెరలేపుతారు. అక్కడున్న హిందువులను బలవంతంగా మతం మార్పించే ప్రయత్నాలు చేస్తారు. ఉర్దూ ను అధికార భాషగా ప్రకటించి.. తెలుగు, కన్నడ, మరాఠి తదితర భాషలపై నిషేధం విధిస్తారు.

అదేవిధంగా ఇష్టారీతిన చిత్రవిచిత్రమైన పన్నులను విధిస్తూ ప్రజలను దారుణంగా హింసిస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురు తిరిగిన ఎన్నో ఊళ్లలో దారుణమైన మారణహోమాన్ని సృష్టిస్తారు. నాడు హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ (Raj Sapru) నిజాం దురాగతాలను తెలుసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు పోలీస్ చర్యకు సిద్ధపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది ?నిజాంల పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు ఏం చేశారు ? ప్రజలను అణచివేసేందుకు రజాకార్లు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు ? హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న ఆగడాలపై భారత ప్రభుత్వం తీసుకున్న పోలీస్ చర్యలు ఫలితాన్నిచ్చాయా ? అన్నవి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read : 40 ఏళ్ల లేటు వయసులో ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న మీరా చోప్రా.. ఫొటోలు వైరల్!

ఎలా ఉంది ?

ప్రత్యేక రాష్ట్రాలు, దేశాల కోసం ప్రపంచంలో జరిగిన పోరాటాలన్నింటిలో.. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నాటి నిజాంల పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు, అకృత్యాలు జరిగాయి. గ్రామాలలో రజాకార్లు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారు. వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలు కదనరంగంలోకి దిగి.. ఎలా వీరమరణం చెందారో అవన్నీ నేటికీ తెలంగాణ చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ నెత్తుటి కథలనే రజాకార్ రూపంలో తెరపై భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ యాట సత్యనారాయణ.

టైటిల్ కార్డులతో తెలంగాణ చరిత్రను పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. దేశంలో ఉన్న పరిస్థితులను అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న నిజాం పరిపాలనను చూపుతూ నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బలవంతంగా మతమార్పిడి, తెలుగు మాట్లాడే పిల్లలపై దారుణాలు, ఊరిలో మహిళలు, ఆడపిల్లలపై రజాకార్లు, ప్రతినిధుల ఆగడాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్ లో రజాకార్ల అకృత్యాలను చూపిస్తే.. సెకండాఫ్ లో ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించే ప్రయత్నం చేశారు.

ఎవరెలా చేశారు ?

రజాకార్ లో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు. ప్రతి 15 నిమిషాలకో పాత్ర తెరపై కనిపించి తమ వీరత్వాన్ని చూపించి వెళ్లిపోతుంది. కాబట్టి అందరూ హీరోలే. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, నిజాం రాజుగా మకరంద్ పాండే, శాంతవ్వగా వేదిక, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గా రాజ్ సప్రులు తమ తమ పాత్రల్లో జీవించారు. కాసీం రిజ్వీ క్యారెక్టర్లో రాజ్ అర్జున్ కనిపించిన తీరు, నటన, అతని హావభావాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి.

ప్లస్ పాయింట్స్

కథ, స్క్రీన్ ప్లే

నటీ-నటుల నటన

చరిత్రలో ఉన్న ఘటనలను ఆవిష్కరించిన తీరు

మైనస్ పాయింట్స్

మితిమీరిన హింస

అందరికీ తెలిసిన తెలంగాణ చరిత్ర కథ

చివరిగా.. నాటి పోరాటాన్ని నేటి తెరపై చూపించిన సినిమా రజాకార్.

 

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×