E-Paper
Advertisement

Amitabh Bachchan: అప్పుడు నేలపైనే పడుకునేవారు, ఆయన స్టార్లలోనే సుప్రీమ్.. రజినీపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Amitabh Bachchan: అప్పుడు నేలపైనే పడుకునేవారు, ఆయన స్టార్లలోనే సుప్రీమ్.. రజినీపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Amitabh Bachchan About Rajinikanth: పలువురు బాలీవుడ్, సౌత్ హీరోలకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అలాగే అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ స్నేహం కూడా ఇప్పటిది కాదు. రజినీకాంత్ యాక్టర్ అవ్వాలని అనుకున్న తర్వాత కేవలం తమిళంలోనే కాదు.. ఇతర భాషల్లో కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. అందులో ఒకటి ‘హమ్’. ఈ మూవీలో మొదటిసారి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ కలిసి నటించారు. 1991లో విడుదలయిన ‘హమ్’లో అమితాబ్ బచ్చన్ అన్నయ్యగా.. రజినీకాంత్, గోవింద తన తముళ్లుగా కనిపించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత రజినీ, అమితాబ్ కలిసి ‘వెట్టయాన్’లో నటించగా అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఆయనే సుప్రీమ్

Advertisement

చెన్నైలో ‘వెట్టయాన్’ ప్రివ్యూ ఈవెంట్ ఘనంగా జరిగింది. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడు. దీంతో రజినీకాంత్ కోసం ఒక వీడియో మెసేజ్‌ను పంపించారు. అందులో వాళ్లిద్దరూ కలిసి నటించిన ‘హమ్’ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేశారు అమితాబ్ బచ్చన్. తమిళంలో ‘వెట్టయాన్’ తన మొదటి సినిమా కావడం, అందులో రజినీకాంత్‌తో కలిసి నటించడం చాలా గొప్పగా అనిపిస్తుందన్నారు బాలీవుడ్ బిగ్ బి. అందరి స్టార్లకంటే రజినీకాంతే సుప్రీమ్ అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ముకుల్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హమ్’ సినిమాలో ఇద్దరు కలిసి నటించడం గురించి మాట్లాడారు.

Also Read: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Advertisement

బ్రేక్స్‌లో అలా

‘‘హమ్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నా ఏసీ వ్యాన్‌లో రెస్ట్ తీసుకునేవాడిని. బ్రేక్ వచ్చిన ప్రతీసారి రజినీకాంత్ మాత్రం నేలపైనే నిద్రపోయేవారు. ఆయన అంత సింపుల్‌గా ఉండడం చూసి నేను కూడా ఏసీ వ్యాన్ నుండి బయటికి వచ్చి రెస్ట్ తీసుకునేవాడిని’’ అని చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి ‘హమ్’లో మాత్రమే కాకుండా ‘అంధా కనూన్’, ‘గిరాఫ్తర్’లో కూడా నటించారు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేసినా చేయకపోయినా సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని బయటపెడుతూనే ఉంటారు. మొదటిసారి ‘వెట్టయాన్’తో తమిళ ప్రేక్షకులను నేరుగా పలకరించనున్నారు బిగ్ బి.

నష్టాల్లో అండగా

1990ల్లో అమితాబ్ బచ్చన్ కార్పొరేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు బిగ్ బి. కానీ కొన్నాళ్లకే అది నష్టాలపాలయ్యింది. అప్పుడు కూడా తనకు అండగా నిలిచారు రజినీకాంత్. ఇక వీరిద్దరూ కలిసి నటించిన ‘వెట్టయాన్’ను టీజీ జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. టీజీ జ్ఞానవేల్ ఇప్పటికే సూర్యతో కలిసి ‘జై భీమ్’ అనే మూవీ చేశారు. ఈ సినిమా ఎన్నో అవార్డులు అందుకోవడంతో పాటు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ‘వెట్టయాన్’పై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలే ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×