BigTV English

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Kalki Sequel.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి.. బాహుబలి 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సెట్ చేశారు. కల్కి 2898 AD వరకు కూడా ఈ రికార్డును ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తీసుకువచ్చిన ఇమేజ్ తో ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD అనే చిత్రాన్ని తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.


సీక్వెల్ కి మరో మూడేళ్లు..

ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సీక్వెల్స్ సినిమాల్లో నటించాల్సి ఉంది. ఒకటి సలార్ సీక్వెల్ తో పాటు కల్కి సినిమా సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు మారుతి రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ చిత్రాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అయితే కల్కి 2898 ఏడి సీక్వెల్ వచ్చే యేడాది ప్రారంభించినా.. దానిని పూర్తి చేయడానికి మరో మూడేళ్ల సమయం.. అంటే 2028 లో విడుదలవుతుందా ? అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమైతే..ప్రభాస్ అభిమానులు అంతకాలం వేచి ఉండగలరా? అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది.


వేడి మీద ఉన్నప్పుడే రిలీజ్ చేయాలి..

2024లో కల్కి 2898 AD చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం చిత్ర బృందం విజయోత్సవంతో దూసుకుపోతోంది. ఈ వేడి మీద ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని అభిమానులు, ట్రేడ్ నిపుణులు కోరుకుంటున్నారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా సీక్వెల్ కి మరో మూడేళ్లు పట్టేటట్టు కనిపిస్తోంది. అయితే ఇది కేవలం గాసిప్ అని కొట్టి పారేస్తున్నారు సినీవర్గాలు. నిజానికి కల్కి లాంటి సినిమాని ఏడాదిన్నర లోపే పూర్తి చేసి రిలీజ్ చేయగలిగితే, నాగ్ అశ్విన్ – అశ్వినీ దత్ బృందానికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దూరం ఎక్కువైతే మాత్రం ఆ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయి.. ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే వేడి మీద ఉన్నప్పుడే సీక్వెల్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

కథ తో పాటూ టైటిల్ కూడా చేంజ్..

Kalki Sequel: Tension among fans on Kalki sequel.. What is the real reason..?
Kalki Sequel: Tension among fans on Kalki sequel.. What is the real reason..?

మరోవైపు సీక్వెల్ కథ మారిందని , టైటిల్ కూడా మారబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. కల్కి 2898 AD నుంచి కర్ణ 3102 బీసీగా మారబోతోందని , అంటే కర్ణుడు – అశ్వద్ధామ చుట్టూ తిరిగే కథని తెరపై చూపిస్తారని, మధ్యలో విలన్ యాస్కిన్ ప్రవేశిస్తారని, ఇక్కడ యాస్కిన్ గా కమల్ హాసన్ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ లో చెప్పే కథ అంటే మహాభారత యుద్ధం తర్వాత అసలు ఏం జరిగింది అనే కథను మనకు తెరపై చూపించబోతున్నారట. వీటన్నింటికి అధికారికంగా నిర్ధారణ రావాల్సి ఉంది. కానీ ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇన్ని పుకార్ల మధ్య ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×