BigTV English

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Amjad Habib: హైదరాబాద్‌లో మరో అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా శ్రద్ధా దాస్

Amjad Habib: అమ్జద్ హబీబ్ (Amjad Habib) అంటే సెలూన్ బిజినెస్‌లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. దేశవ్యాప్తంగా అమ్జద్ హబీబ్‌కు సంబంధించిన ఎన్నో సెలూన్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఇక తాజాగా హైదరాబాద్‌లోని నల్లగండల్లలో కూడా కొత్తగా అమ్జద్ హబీబ్ సెలూన్ ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి సినీనటి శ్రద్ధా దాస్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అంతే కాకుండా అమ్జద్ హబీబ్ వ్యవస్థపాకుడు సైతం ఈ ఓపెనింగ్‌కు హాజరయ్యారు. మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ రెడ్డితో శ్రద్ధా దాస్ కలిసి ఈ సెలూన్‌కు శ్రీకారం చుట్టారు.


ఫ్రాంచైజ్‌లు కావాలంటే సంప్రదించవచ్చు

నల్లగండల్లో అమ్జద్ హబీబ్ సెలూన్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందంటూ అక్కడికి వచ్చిన మీడియా, కస్టమర్లతో మాట్లాడారు. 100 ఏళ్లగా విజయవాడ, హైదరాబాద్‌లలో తమ సెలూన్స్ ప్రారంభమయ్యాయని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు మియాపూర్, ఇప్పుడు నల్లగండల్లలో ఈ సెలూన్ ప్రారంభమయ్యింది. అంతే కాకుండా హైదరాబాద్‌లో మరిన్ని బ్రాంచ్‌లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతే కాకుండా ఫ్రాంచైజ్‌లు ఓపెన్ చేయడానికి కూడా ఎవరైనా తమరిని సంప్రదించవచ్చని ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన నగరాల్లో సెలూన్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవారికి అమ్జద్ హబీబ్ మంచి అవకాశం అందించనున్నారు.


Also Read: సాంప్రదాయంగా పెళ్లి పనులు షురూ.. నాటి కాలాలను గుర్తుచేసిన శోభిత..!

అబ్దుల్ కలాంకు హెయిర్ స్టైలిస్ట్

తెలుగు రాష్ట్రాల్లో తమ బ్రాండ్‌‌ను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని అమ్జద్ హబీబ్ వ్యవస్థాపకులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చంచల్‌గూడ జైల్లో ఖైదీలకు ట్రైనింగ్ ఇస్తున్నానని తెలిపారు. ఇది చాలా మంచి విషయమని ప్రజలు అనుకుంటున్నారు. అమ్జద్ హబీబ్ సెలూన్స్ గురించి చాలామందికి తెలిసినా.. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలామంది తెలియదు. 16 సంవత్సరాల పాటు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వద్ద హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు అమ్జద్ హబీబ్. రాజకీయ నాయకులకు మాత్రమే కాదు.. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆయన స్టైలిస్ట్‌గా వ్యవహరించారు.

అదే నా గ్లామర్ సీక్రెట్

అలాంటి అమ్జద్ హబీబ్ బ్రాండ్‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని బిజినెస్ హెడ్ తెలిపారు. ఈ సెలూన్‌లో ఉపయోగించేవి అన్నీ ప్రీమియమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అందంగా, కొత్తగా కనిపించడం కోసం తమ సెలూన్స్ సాయం చేస్తాయని అన్నారు. ఇక ఫ్రాంచైజ్ కోసం కూడా తమను నేరుగా సంప్రదించవచ్చని కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు నిర్వహకులు. ఇక ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో శ్రద్ధా దాస్ మాట్లాడుతూ.. ‘‘ఎపుడు హ్యాపీ ఉండడమే నా గ్లామర్ సీక్రెట్’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల విషయంలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో దూసుకుపోతోంది శ్రద్ధా దాస్ (Shraddha Das)

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×