E-Paper
Advertisement

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!
Advertisement

Rajinikanth Dharman: రజనీకాంత్…తలైవాగా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ వెటరన్ స్టార్ తెరపై కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు. ఆ స్టైల్, ఆ నడక, ఆ మేనరిజమ్స్ చూసి దశాబ్దాలుగా అభిమానులు మురిసిపోతున్నారు. వయసు కేవలం నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తలైవా, ఇప్పుడు తన 173వ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ సంచలనానికి తెరతీశారు. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త వైవిధ్యమైన అవతారంలో రజనీకాంత్ అలరించేందుకు సిద్ధమవడంతో మూవీ లవర్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ది డెడ్లీ డాక్టర్’గా కనిపించనున్న తలైవా 

ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కి ‘ధర్మన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్  చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’గా కనిపించబోతుండటం విశేషం. సమాజంలో న్యాయాన్ని గెలిపించేందుకు, అన్యాయాన్ని ఎదిరించేందుకు కోటు తొడిగిన ఒక పవర్‌ఫుల్ వైద్యుడిగా తలైవా క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతోంది. ‘ప్రదీప్ రంగనాథన్’ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ భారీ యాక్షన్ డ్రామాను డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రోజే ఇండస్ట్రీని షేక్ చేసింది.

Advertisement

also read:పోలీస్ స్టేషన్ టు బిగ్‌బాస్ హౌస్? సీజన్ 10 మేకర్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఎస్‌ఐ..

ఇండియన్ సినిమాలోనే ఒక మైల్ స్టోన్

ఉలగనాయగన్ కమల్ హాసన్ తన సొంత బ్యానర్ అయిన ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో 1970, 80ల కాలంలో మూండ్రు ముడిచ్చు, (1976)అవర్గళ్ వంటి క్లాసిక్ సినిమాల్లో రజనీ, కమల్ కలిసి నటించి మెప్పించారు. ఆ తర్వాత వారిద్దరూ విడివిడిగా తమ కెరీర్లను నిర్మించుకుని సూపర్ స్టార్లుగా ఎదిగారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం రజనీకాంత్ నటిస్తున్న సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా మారడం అనేది కోలీవుడ్‌లోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమాలోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పకతప్పదు.

న్యాయం కోసం డాక్టర్ అవతారంలో

Advertisement

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రజనీకాంత్‌కు జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తుండగా, గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా చిత్రబృందం ‘ది ఓజీ స్వాగ్’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. డాక్టర్ కోట్ వేసుకుని, మెడలో స్టెతస్కోప్‌తో ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న రజనీకాంత్ విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. న్యాయం కోసం డాక్టర్ అవతారంలోనే రౌడీల ఆట కట్టించే ఒక డిఫరెంట్ యాక్షన్ మోడ్‌ను ఈ వీడియో హింట్ చేస్తోంది.

also read:వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం.. టీజర్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారంటీ!

ఎలాంటి సంచలనం నమోదు అవుతుందో !

ఇక రజనీకాంత్ మార్క్ యాక్షన్ ఎలివేషన్లకు థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘పేట’, ‘దర్బార్’, ‘జైలర్’ సినిమాల తర్వాత రజనీకాంత్-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మ్యూజికల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ధర్మన్’ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీకాంత్ వింటేజ్ స్టైల్, ఎమోషన్స్,తో పాటు ఒక బలమైన మెసేజ్ కూడా ఇందులో ఉండబోతుందని తెలుస్తుంది. చూడాలి మరి దాదాపు నలబై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ కాంబోలో ఎలాంటి సంచలనం నమోదు అవుతుందో !

Related News

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

Big Stories

Advertisement
×