E-Paper
Advertisement

పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్
Advertisement

Mahesh Babu: మీకొకటి గుర్తుండాలి..వారణాసి మొదలయ్యే ముందర జక్కన్న ఒక పోస్టర్ వదిలాడు.మహేష్ పాస్ పోర్ట్ ని సీజ్ చేశాను. ఇక మహేష్ ఎక్కడికి పారిపోడు అంటూ సింహాన్ని ఒక బోన్ లో వేసినట్టు సింబాలిక్ గా బిల్డప్ ఇచ్చాడు.అది చూసిన ఫ్యాన్స్ ఇంకేం మా మహేష్ సినిమా కోసం తప్ప ఇప్పట్లో మళ్ళీ విమానం ఎక్కడెమో అంటూ తెగ ఫీల్ అయిపోయారు. కానీ మహేష్ ని లాక్ చేసిన ఆ జక్కన్న ఆ తాళాలు అతడి చేతిలోనే పెట్టినట్టున్నాడు.అవును..మహేష్ ఎంచక్కా కావలసినప్పుడుల్లా ఆ లాక్ ని బ్రేక్ చేస్తూ గ్యాప్ దొరికిన ప్రతీసారి ఆ పాస్ పోర్ట్ పట్టుకుని విమానం ఎక్కేస్తున్నాడు మహేష్.

హీరోలని పిండేసే జక్కన్న 

ప్రస్తుతం ‘వారణాసి’ లొకేషన్‌లో బిజీగా ఉన్న ప్రిన్స్, సడన్‌గా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చి ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ లో ల్యాండ్ అయిపోయారు. ..నిజానికి ఈ సమ్మర్ సీజన్‌లోనే మహేష్ ఇలా విదేశాల బాట పట్టడం ఇది రెండోసారి. ఒకవైపు రాజమౌళి ఏమో ‘ఈగ’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ దాకా తన హీరోలను అంగుళం కూడా కదలనివ్వకుండా లొకేషన్లలో పిండేస్తాడనే పేరుంది. కానీ మహేష్ విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ అస్సలు వర్కవుట్ అవుతున్నట్టు లేదు. హీరో గారు ఎప్పటికప్పుడు చల్లగా జారుకుంటూ ఫుల్ రిలాక్స్ అవుతున్నారు.

Advertisement

also read:బోల్డ్ సబ్జెక్ట్‌తో సందీప్ కిషన్ ఫన్ రైడ్.. ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ అదిరిపోయిందిగా !

అంటార్కిటికా ప్లాన్స్‌లో మార్పులు జరిగాయా?

అయితే అసలు కథ ఇక్కడే ఉంది.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ను మైనస్ డిగ్రీల చలి ఉండే మంచు ఖండం అంటార్కిటికాలో ప్లాన్ చేశారట జక్కన్న.జులై చివర్లో లేదా ఆగస్ట్‌లో ఆ షెడ్యూల్ ఉంటుందని ఇదివరకే చెప్పుకొచ్చారు మేకర్స్.నిజానికి ఏప్రిల్ నెలలో మహేష్ విదేశాలకు వెళ్ళినప్పుడు, అది అంటార్కిటికా చలిని తట్టుకోవడానికి బాడీని సెట్ చేసుకునే ‘ఫిజికల్ కండిషనింగ్’ కోసమేనని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.అంతలోనే ఇప్పుడు మళ్లీ ఆయన ఫ్రాన్స్ ఫ్లైట్ ఎక్కేశారు. ఈ లెక్కన చూస్తుంటే జక్కన్న అంటార్కిటికా ప్లాన్స్‌లో ఏమైనా మార్పులు జరిగాయా? లేక మరేదైనా కారణమా అన్న టాక్  ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఎలా పరుగులు పెడుతుందో

Advertisement

అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది రాజమౌళినే. హీరో గారు ఫ్రాన్స్‌లో ఎంజాయ్ చేస్తున్నా, వారణాసిలో షూటింగ్ మాత్రం ఆపలేదు. ‘హీరో లేకపోతేనేమో మిగతా వాళ్ళతో లాగించేస్తా అంటూ మహేష్ లేని సీన్స్ ని చక చక లాగించేస్తున్నాడట.ఎలాగూ జులై రెండో వారం కల్లా మహేష్ బాబు తిరిగి ఇండియా వచ్చేస్తారు కాబట్టి, అప్పటివరకు లొకేషన్ ఖాళీగా ఉంచడం ఎందుకని జక్కన్న వేసిన ప్లాన్ అన్నమాట.

ఇక ఈ భారీ ప్రాజెక్టులో మహేష్‌ను ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ యోధుడిగా చూపిస్తుండగా,గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను కుంబ అనే విలన్‌గా దింపేస్తున్న సంగతి తెల్సిందే.మరి జులైలో మహేష్ తిరిగి వచ్చాక ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఎలా పరుగులు పెడుతుందో చూడాలి.!

 

also read:వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం.. టీజర్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారంటీ!

Related News

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

Big Stories

Advertisement
×