BigTV English

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్.. జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య..!

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్.. జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య..!

Ananya Nagalla.. క్యాస్టింగ్ కౌచ్.. ప్రస్తుతం ఈ పదం ఎక్కడ విన్నా బాధితులు బెంబేలెత్తిపోతున్నారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకటి క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పితే అవకాశాలు రావని, ఇండస్ట్రీలో ఇమేజ్ పోతుందని.. ఇలా భయపడే వారు కూడా ఉన్నారు.దీనికి ఇలాంటి కారణాలు బోలెడు.. ఇవన్నీ అమ్మాయిల గొంతును నొక్కేస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా మలయాళంలో జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక తర్వాత చాలామంది ధైర్యంగా ముందుకొచ్చి ఇండస్ట్రీలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్పుకొచ్చారు.


క్యాస్టింగ్ కౌచ్ పై స్టార్ హీరోయిన్స్ కామెంట్స్..

ఈ నేపథ్యంలోని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ వచ్చిందంటూ.. పాన్ ఇండియా హీరోయిన్ లుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha), అనుష్క(Anushka )లాంటి హీరోయిన్లు ఒక్కసారిగా టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమా కమిటీ లాంటి కమిటీ వేయాలని కోరడంతో అందరూ నివ్వెరపోయారు. దీనికి తోడు టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని రకరకాల కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై ఊహించని నిజాలు బయటపెట్టింది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ (Ananya Nagalla).


పొట్టేల్ మూవీ ట్రైలర్ లాంచ్..

వాస్తవానికి తెలుగు బ్యూటీ అయినప్పటికీ నటించే సత్తా ఉన్నా .. ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడం బాధాకరమనే చెప్పాలి. ఈమె కాదు అంజలి, ఇలా ఎంతోమంది తెలుగువారి అయినా.. తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి కోలీవుడ్ లో సెటిల్ అయిపోయారు. ఇకపోతే తంత్ర సినిమా తర్వాత మళ్లీ అనన్య తెలుగు ప్రేక్షకుల ముందుకు పొట్టేల్ సినిమా ద్వారా రాబోతోంది. ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ విడుదల చేయగా.. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అనన్య నాగళ్లకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురవగా… లేడీ జర్నలిస్ట్ నోరు మూసేలా ఊహించని రిప్లై ఇచ్చింది.

క్యాస్టింగ్ కౌచ్ పై ఎదురైన ఊహించని ప్రశ్న..

తంత్ర , డార్లింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనన్య మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సాహిత్ మోతుకూరి డైరెక్షన్లో వస్తున్న పొట్టేల్ సినిమాలో అనన్య లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఈ సందర్భంగా హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి అనన్య నాగళ్ళ హాజరయ్యింది. ఇందులో అనన్యకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ఒక జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతూ. తెలుగు ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రావాలి అంటే భయపడతారు. నిజానికి ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ అడుగుతున్నారు. మీకు ఇలాంటి అనుభవం ఎదురయిందా అంటూ ప్రశ్నించింది.

ఒక్క మాటతో జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య..

దానికి అనన్య మాట్లాడుతూ.. నాకైతే ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. నిజాలు తెలుసుకోకుండా 100% ఉంటుందని ఎలా చెబుతారు..?నిజానికి ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం నూటికి నూరు శాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది అసలు టాలీవుడ్ లో లేదు. ఎక్కడైనా పాజిటివ్ , నెగిటివ్ అనేది రెండూ సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు. నటిగా నేను చెబుతున్నాను క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు అయితే ఇండస్ట్రీలో లేవు అంటూ ఆమె తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అనన్య నటించిన పొట్టేల్ సినిమా అక్టోబర్ 25వ తేదీన థియేటర్లలోకి రానుంది..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×