BigTV English

Ananya Nagalla: ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య.. వీడియో వైరల్..!

Ananya Nagalla: ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య.. వీడియో వైరల్..!

Ananya Nagalla.. తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తెలంగాణ, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి కి చెందిన ఈమె హైదరాబాదులోనే రాజమహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.2019లో తొలిసారి మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో పద్మ అనే క్యారెక్టర్ లో అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఉత్తమ మహిళ అరంగేట్రానికి సైమా అవార్డు కోసం నామినేట్ కూడా చేయబడింది. ఇక 2021లో ప్లే బ్యాక్ అనే సినిమాలో సుజాత క్యారెక్టర్ పోషించిన ఈమె.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో దివ్యా నాయక్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి విజయం లభించింది అని చెప్పవచ్చు.


ప్లాస్టిక్ యూస్ చేయవద్దంటూ అవేర్నెస్..

ఇక తర్వాత వరుసగా పలు పాత్రలు పోషిస్తున్న అనన్య నాగళ్ళ 2024 లో తంత్ర సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే ఏడాది డార్లింగ్, పొట్టేల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఈమె పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. వారికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు విషయంలోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం అవేర్నెస్ ఇచ్చింది. ముఖ్యంగా ఎవరు కూడా ప్లాస్టిక్ ఉపయోగించవద్దని , స్టీల్ స్ట్రా తమతో పాటు క్యారీ చేయమని కోరింది. తాను కూడా ఎప్పుడు స్టీల్ స్ట్రా తనతో పాటు తీసుకెళ్తానని.. అయితే అలా తీసుకెళ్లని సమయంలో డైరెక్ట్ గా కొబ్బరిబోండం నోటితోనే తాగేస్తాను అని, అందుకు సంబంధించిన వీడియో ని కూడా షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. మాకు చెప్పడం కాదు.. మీ పక్క వాళ్ళు కూడా పాటిస్తున్నారా లేదా చూడండి. మీ పక్కన వున్న బామ్మా ప్లాస్టిక్ స్ట్రా తో తాగేస్తుంది. గమనించలేదా అంటూ కామెంట్లు చేయగా మరికొంతమంది మద్యం కూడా ఇలాగే తాగుతుంది అంటూ చేశారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ananya nagalla (@ananya.nagalla)

ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య..

దీంతో హర్ట్ అయిన అనన్య నాగళ్ల ఈ విషయంపై ఒక వీడియో షేర్ చేసింది..అందులో ఏముంది అనే విషయానికి వస్తే.. సరే ఒక వీడియో చేశానండి. ప్లాస్టిక్ యూస్ చేయడం తగ్గించమని చెప్పాను. ఇందులో తప్పేమైనా ఉందా.. మీరే చెప్పండి. లేదు కదా.. స్టీల్ స్ట్రా లో దుమ్ము ఉందని కొంత మంది, నీ పక్కన ఉన్న వాళ్లకు చెప్పు అని కొంతమంది.. ఇన్ని కామెంట్లు చేస్తున్నారు కదా.. ఎందుకు చిన్న విషయం చెప్పాను. నచ్చితే చేయండి లేకపోతే లేదు. అంతే సింపుల్ కదా.. ఇంతలా ట్రోల్ చేయడం కరెక్ట్ గా లేదు. అంటూ ఒక వీడియో షేర్ చేసింది అనన్య నాగళ్ళ. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తూ ఈమె చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×