E-Paper
Advertisement

Anchor Suma: చీరల యాడ్ కోసం.. ‘బాహుబలి’ సీన్‌ను ఖూనీ చేసిన యాంకర్ సుమ, ఇదేం వాడకం మామ!

Anchor Suma: చీరల యాడ్ కోసం.. ‘బాహుబలి’ సీన్‌ను ఖూనీ చేసిన యాంకర్ సుమ, ఇదేం వాడకం మామ!
Advertisement

Anchor Suma:బుల్లితెర మహారాణి యాంకర్ సుమ కనకాల (Suma kanakala) తన వాక్చాతుర్యంతో, చమత్కారంతో రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. టీవీ షోలే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా పలు వాణిజ్య ప్రకటనలతో సుమ బిజీగా ఉంటారు. అయితే, తాజాగా ఒక శారీ హౌస్ ప్రమోషన్ కోసం ఆమె చేసిన ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’లోని ఒక ఐకానిక్ సీన్‌ను చీరల అమ్మకం కోసం వాడటం చూసి నెటిజన్లు “ఇదేం వాడకం మామ!” అంటూ తలలు పట్టుకుంటున్నారు. వివరాలలోకి వెళితే..

బాహుబలి సీన్ రీ-క్రియేషన్:

బాహుబలి సినిమాలో దేవసేనను అవమానించిన వ్యక్తి తల నరికే సీన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే సీన్‌ను శారీ యాడ్ కోసం సుమ అండ్ టీమ్ రీ-క్రియేట్ చేశారు. ఇక్కడ తల నరకడం వెనుక ఉద్దేశం..చీరలు బాగున్నాయి..ఇక యాడ్ లో సుమ బాహుబలి లాగ కత్తి పట్టి దేవసేన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. దేవసేన గుడిలోని వచ్చిన వాళ్ళ చీరలు లాగేసుకుంటున్నాడు,నా చీర లాగేసుకోబోయాడు అందుకే చేయి నరికాను అని అనటం, వెంటనే బాహుబలి లాగ సుమ తల నరకటం..యాడ్ మొత్తం మూవీ అన్న రేంజ్‌లో హంగామా చేశారు. పౌరాణిక గెటప్పులు వేసి, భారీ డైలాగులు చెబుతూ సుమ చేసిన ఈ హడావిడి ఆకట్టుకోవడం పక్కన పెడితే, సినిమాలోని గంభీరమైన సన్నివేశాన్ని ఇలా కామెడీగా మార్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఖూనీ చేయడం అంటే ఇదే’ అని కొందరు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

also read:Vishwambhara: చిరంజీవి చేతులు దాటిపోతున్న విశ్వంభర?

మార్కెటింగ్ వ్యూహం.. నెటిజన్ల సెటైర్లు:

ప్రస్తుత కాలంలో బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఏదో ఒక కొత్తదనం కావాలి. సుమ కూడా అదే పంథాలో వెళ్తూ బాహుబలి క్రేజ్‌ను వాడేసుకున్నారు. సుమ క్రేజ్ వల్ల ఈ యాడ్ లక్షలాది మందికి చేరువవుతోంది, తద్వారా ఆమె భారీగానే పారితోషికం అందుకుంటున్నారనడంలో సందేహం లేదు. అయితే, ఇలాంటి ఐకానిక్ సీన్లను యాడ్స్ కోసం వాడేటప్పుడు కొంత మేరకైనా గౌరవం ఇస్తే బాగుంటుందని సినిమా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. సుమ మాత్రం తన మార్క్ ఎనర్జీతో ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు.

Advertisement

ఏది ఏమైనా యాంకర్ సుమకు ఇలాంటి ట్రోల్స్ కొత్తేమీ కాదు. కానీ, శారీ యాడ్ కోసం ఆమె చేసిన ఈ ‘బాహుబలి’ ప్రయోగం మాత్రం ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇది కేవలం వినోదం కోసమే అని కొందరు అంటుంటే, క్రియేటివిటీ పేరుతో క్లాసిక్ సీన్లను చెడగొట్టొద్దని మరికొందరు కోరుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×