Shocking Incident: మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు 45 ఏళ్ల క్రితం క్వింటా (100 కేజీలు) గోధుమలను దొంగతనం చేసిన కేసులో తాజాగా అరెస్టు అయ్యారు. అప్పట్లో అతడు దొంగిలించిన గోధుమల విలువ దాదాపు రూ.100 అని.. ఈ కేసుకు సంబంధించి నిందితుడు ఇన్నేళ్లుగా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
1980 ప్రాంతంలో నిందితుడు సలీం మరో ఆరుగురితో కలిసి బాల్సముండ్ కాకడ్ (Balsamund Kakad) ప్రాంతంలోని పొలాల నుండి గోధుమలను దొంగిలించాడు. అప్పుడు అతనికి 20 ఏళ్లు అని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (మండలేశ్వర్) శ్వేతా శుక్లా (Shweta Shukla) తెలిపారు. మెుత్తం క్వింటా గోధుమలు చోరికి గురికాగా.. అప్పట్లో కిలో గోధుమ రూ.1.15గా ఉన్నట్లు తెలిపారు. ఫలితంగా మెుత్తం దొంగిలిచబడిన గోధుమల విలువ రూ.115 అని స్పష్టం చేశారు. అయితే నిందితుడు పరారు కావడంతో అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉందని.. సలీంపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యిందని పేర్కొన్నారు.
దొంగతనం తర్వాత నిందితుడు సలీం బాలక్వాడ పోలీసు స్టేషన్ (Balakwada Police Station) పరిధిలోని బాల్ఖడ్ గ్రామానికి చేరుకొని కొన్నాళ్లపాటు ప్రశాంత జీవితాన్ని గడిపారని పోలీసు అధికారి శ్వేతా శుక్లా తెలిపారు. ప్రస్తుతం ధార్ జిల్లాలోని బాగ్ పట్టణంలో కొడుకుతో కలిసి కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఓ కేసుకు సంబంధించి మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టగా.. సలీం గురించి తెలిసిందని పేర్కొన్నారు. బాగ్‌లోని తన దుకాణంలో సలీం ఉన్నట్లు గుర్తించి.. శనివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.
Also Read: Baba Vanga Prediction: బంగారం, వెండి ధరలపై.. బాబా వంగా జోస్యం.. 2026లో ఆభరణాలు కొనలేమా?
స్థానిక కోర్టులో సలీంను హాజరు పరచగా.. న్యాయస్థానం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించిందని పోలీసులు తెలిపారు. అయితే 4 దశాబ్దాల క్రితం జరిగిన చోరి ఘటన కాబట్టి.. అందరూ మర్చిపోయి ఉంటారని భావించినట్లు నిందితుడు సలీం పోలీసులతో అన్నట్లు తెలుస్తోంది. ఆ కేసును ఇన్నాళ్ల పాటు గుర్తుంచుకొని మరి.. తనను అరెస్టు చేయడం షాక్ కు గురిచేసిందని పేర్కొన్నారు.
Also Read: Sama Ram Mohan Reddy: వయసు పెరిగిందే తప్పా.. కేటీఆర్ బుర్రలో గుజ్జు లేదు.. సామ రామ్మోహన్ ఫైర్