BigTV English
Advertisement

Andrea Jeremiah: పెళ్లైనవాడితో ఎఫైర్.. నరకం చూపించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Andrea Jeremiah: పెళ్లైనవాడితో ఎఫైర్.. నరకం చూపించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Andrea Jeremiah: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కమ్ సింగర్  ఆండ్రియా  జెర్మియా గురించి తెలుసు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్ గా కన్నా సింగర్ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది. రాఖీ, దేశముదురు, బొమ్మరిల్లు, కింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఆమె హిట్ సాంగ్స్ పాడి మెప్పించింది. ఇక సింగర్ గానే కాకుండా తెలుగులో తడాఖా, సైంధవ్ సినిమాలో నటించింది. ఇక డబ్బింగ్ సినిమాలతో అయితే  ఆండ్రియా మరింత మెప్పించింది. ఇక ప్రస్తుతం ఒకపక్క హీరోయిన్ గా .. ఇంకోపక్క సింగర్ గా బిజీగా మారింది. 


ఆండ్రియా.. సినిమాల్లో కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. అప్పట్లో సుచీ లీక్స్ ఎంత పెద్ద పెను సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం  రోడ్డున పడేసాయి. స్టార్ హీరో హీరోయిన్ల నిజ స్వరూపాలను బయటపెట్టాయి. ఇక ఆ లీక్స్ లో ఎక్కువ బయటపడిన ఎఫైర్స్ అంటే ఆండ్రియాయే అని చెప్పాలి. సింగర్ అనిరుధ్ తో ముద్దులు, రానాతో హగ్గులు.. ఇలా ప్రతి ఫోటోలో ఆండ్రియానే కనిపించింది.

సుచీ లీక్స్ తరువాత ఆండ్రియా కొన్నిరోజులు ఇండస్ట్రీకి దూరమయ్యింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కెరీర్ ను నాశనం చేసుకుంది. అయితే ఆమె కెరీర్ నాశనం అవ్వడానికి, డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం కేవలం సుచీ లీక్స్ మాత్రమే కాదు ఆమె బ్రేకప్. ఈ విషయాన్నీ ఆండ్రియా అందరి ముందు చెప్పుకొచ్చింది. 2019 లో ఆండ్రియా బ్రోకెన్ వింగ్స్ అనే కవితల పుస్తకాన్ని రాసింది. అందులో ఆమె కవితలు అన్ని చాలా విచారంగా.. బాధతో కూడుకున్నవిగా ఉండడంతో ఎంతోమంది అభిమానులు.. ఆమె బాధకు కారణం ఏంటి.. ? అని అడగడం మొదలుపెట్టారు.


Thandel : ‘తండేల్’ రాజుకి ముగ్గురు స్టార్స్ సాయం… ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరంటే ?

ఇక ఆండ్రియా తన బాధకు కారణం బ్రేకప్ అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. ఆమెకు బ్రేకప్స్ ఏమి కొత్త కాదు. కాకపోతే ఇది చాలా పెయిన్ ఫుల్ అని చెప్పుకొచ్చింది. ఒక పెళ్లి  అయిన వ్యక్తితో తాను ఎఫైర్ నడిపినట్లు ఒప్పుకుంది. ఆ ఎఫైర్ వలన తాను ఎన్నో ఇబ్బందులను  ఎదుర్కొన్నట్లు ఆమె  తెలిపింది. ” నేను గతంలో ఒక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను. అప్పటికే అతనికి పెళ్లి అయ్యింది. ఆ విషయం తెలిసే ఎఫైర్ నడిపాను. కానీ, అతను నన్ను వేధించాడు. నరకం చూపించాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో హింస పెట్టాడు. అతని నుంచి విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది” అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఎఫైర్ తరువాత ఆండ్రియా మళ్లీ తన లైఫ్ ను రీస్టార్ట్ చేసింది. సింగర్ గా ఏఆర్ రెహమాన్ గ్రూప్ లో చేరింది. ప్రస్తుతం ఆ గ్రూప్ లోనే ఆమె సాంగ్స్ పాడుతుంది. ఇంకోపక్క సినిమాలతో కూడా బిజీగా మారింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం పిశాచి 2. మిస్కిన్ దర్శకత్వం  వహించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుందో. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×