Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం తుది దశకు చేరుకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పార్టీ నేతలు పోటాపోటీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశ రాజధానిపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు.
బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజలను ఆకర్షించేలా ఇష్టమొచ్చిన హమీలు ఇస్తున్నారు. మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. దీంతో రాజధాని నగరంలో పోలిటికల్ వెదర్ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా పార్టీలన్నీ ఉచితాలప వైపే మొగ్గు చూపుతున్నాయి. ఉచితాలు ప్రకటించి ప్రజలు అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువత, మహిళలు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హామీలను గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, మహిళలకు నెలవారీ ఫించన్ ఇలా నోటికొచ్చిన హామీలను ప్రకటిస్తున్నారు. ఆమ్ ఆద్మీ ఇప్పటికే 15 హామీలు ప్రకటించగా.. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మూడుసార్లు తన హామీలను వెల్లడించింది. కాంగ్రెస్ కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాసి సిలిండర్, నిరుద్యోగ యువతకు రూ.8500 స్టైఫండ్ ఇలా హామీలను ప్రకటించింది.
ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా రాష్ట్రంలోని యుమునా రివర్‌లో విషం కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ అలా మాట్లాడడంతో రాజధాని నగరంలో రాజకీయ దుమారం మొదలైంది. దీనిపై స్వయంగా ప్రధాని మోదీనే స్పందించారు. హర్యానా ప్రజలు అలాంటి వారు కాదని.. వారు దేశ భక్తులు.. ఇలా పనికి రాని ఆరోపణలు తగదని అన్నారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ వెంటనే సమాధానం ఇవ్వాలని ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది.
ఢిల్లీలో ఇది కీలక సమస్య..
ఢిల్లీలో ముఖ్యంగా ఉన్న సమస్య కాలుష్యం. శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గాలి నాణ్యత లోపిస్తుంది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదో అప్పటి వరకు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి యూజ్ ఉండదు. అయితే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా కాలుష్య నియంత్రణకు తీసుకునే చర్యలపై హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఒక్క పార్టీ కూడా కాలుష్యం నివారణ చర్యలపై తన మేనిఫెస్టోలో ప్రకటించలేదు. దీంతో ప్రధాన సమస్యలన్నీ పక్కదాని పడుతన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Thandel : ‘తండేల్’ రాజుకి ముగ్గురు స్టార్స్ సాయం… ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరంటే ?
రాజధాని నగరంలో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపడతారు. పదేళ్ల నుంచి ఆప్ ఇక్కడ రూల్ చేస్తోంది. అయితే ఆప్ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. అయితే కేజ్రీవాల్ ను ఓడించి రాజధాని పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ కూడా ఉచితాలు ప్రజలు అట్రాక్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలిని ప్రయత్నిస్తోంది.