BigTV English

Thandel : ‘తండేల్’ రాజుకి ముగ్గురు స్టార్స్ సాయం… ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరంటే ?

Thandel : ‘తండేల్’ రాజుకి ముగ్గురు స్టార్స్ సాయం… ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరంటే ?

Thandel : అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికీ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే మేకర్స్ మూవీ కోసం నాగచైతన్య మార్కెట్ కు మించిన బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ‘తండేల్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయినప్పటికీ మరో ముగ్గురు హీరోల హెల్ప్ తో సినిమాపై మరింత హైప్ ను పెంచి, దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం పదండి.


ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్

‘తండేల్’ (Thandel) సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కాగా, అందులో బుజ్జి తల్లి – రాజుల ఎమోషనల్ ఇంటెన్స్ లవ్ స్టోరీని, నడి సముద్రంలో రాజు చేసిన సాహసాలను, పాకిస్థాన్ జైల్లో రాజు చేసే యాక్షన్ ను చూపించి అంచనాలను అమాంతం పెంచారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారనే వార్తతో బజ్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.


‘తండేల్’ రాజుకి మరో ఇద్దరు హీరోల హెల్ప్ 

అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు హీరోలు ‘తండేల్’ (Thandel) రాజుకు ప్రమోషన్లలో సాయం చేయబోతున్నారు. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు కార్తీ (Karthi), అమీర్ ఖాన్. ‘తండేల్’ మూవీని పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రమోషన్ల పరంగా మేకర్స్ అన్ని భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తమిళనాడు ప్రమోషన్లలో కార్తీని రంగంలోకి దింపబోతున్నారు. కోలీవుడ్లో ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఈరోజు చెన్నైలో కార్తీ గెస్ట్ గా, ‘తండేల్’ (Thandel) ట్రైలర్ లాంచ్ జరగనుంది.

మరోవైపు హిందీలో కూడా ఈ మూవీ స్పెషల్ ఈవెంట్ ఉండబోతోంది. దానికి చీఫ్ గెస్ట్ గా బాలీవుడ్ బడా స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) హాజరు కాబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అమీర్ ఖాన్ – నాగ చైతన్య మధ్య మంచి బాండింగ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గతంలో ‘లాల్ సింగ్ చద్దా’ అనే హిందీ మూవీని చేశారు. నాగ చైతన్యకు ఇదే బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ. ఇప్పుడు సెకండ్ మూవీ గా ‘తండేల్’ (Thandel) రిలీజ్ కాబోతోంది. ఈ ముగ్గురు హీరోల హెల్ప్ ‘తండేల్’ రాజుకి ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే సినిమా తెరపైకి వచ్చేదాకా ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×