BigTV English

Anil Ravipudi : రాజమౌళిని కాపీ కొడుతున్న అనిల్ రావిపూడి..ఆస్కార్ రేంజ్ లో సినిమా..?

Anil Ravipudi : రాజమౌళిని కాపీ కొడుతున్న అనిల్ రావిపూడి..ఆస్కార్ రేంజ్ లో సినిమా..?

Anil Ravipudi : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు.. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అపజయం ఎరుగని డైరెక్టర్ గా ఆయనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమాతో భారీ విజయాలను సొంత చేసుకోవడం మాత్రమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో సునామి సృష్టించాడు. రాజమౌళి నుంచి సినిమా రావడం లేట్ ఏమో కానీ హిట్ అవ్వడం మాత్రం పక్కా అనే అందరూ అంటున్నారు. దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ దర్శకధీరుడిగా తన సత్తాను చాటారు. ఇక సినిమా సినిమాకు రాజమౌళి రేంజ్ పెరుగుతూనే ఉంది. ఈయన ప్లాన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అందుకే ఈయనను ఫాలో అవ్వాలని ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ అనుకుంటారు. అయితే ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ రాజమౌళిని కాపీ కొడుతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఏ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నాడో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి కూడా రాజమౌళి దారిలో నడుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉంది అయితే అందులో ఎవరిని హీరోగా పెట్టి సినిమా చేస్తానో నాకు తెలియదు. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఒక మైథలాజికల్ సినిమా చేయాలనుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.. మహాభారతంలోని అంశాల్లో ఏదో ఒక అంశాన్ని పట్టుకొని అదిరిపోయే స్టోరీని ప్రిపేర్ చేసి సినిమా తీయాలని నా కల అంటూ అనిల్ రావిపూడి ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ అవ్వకండి…


నిజానికి డైరెక్టర్ రాజమౌళి మహాభారతం స్టోరీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే ఫార్ములా నీ ఫాలో అవ్వడం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అనిల్ రావిపూడి పై రాజమౌళి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. నీకు ఎక్కడ స్టోరీ దొరకలేదా ఏంటి రాజమౌళిని కాపీ కొడుతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికొస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నా మూవీతో బ్లాక్ బస్టర్ హీట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం ఓ రెండు స్టోరీలను రెడీ చేసుకున్నాడు. ఇటీవలే చిరంజీవితో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×