CBN Progress Report: ప్రతి పక్షాల విమర్శలకు.. ఆర్ధిక వేత్తలు, అనలిస్టుల అనుమానాలకు ఒకే ఒక్క బడ్జెట్‌తో సమాధానం చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ హామలు అమలు చేయడం సాథ్యం కాదని వైసీపీ వాదన. సూపర్ సిక్స్‌లో మరో 2 కీలక పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. సమక్షేమంతో సరిపోతుందా? అభివృద్ధి చంద్రబాబు మెయిన్ టార్గెట్. కాబట్టి మూల ధన వ్యయం కోసం కూడా భారీ కేటాయింపులు చేసారు. ఇంత చేసినా.. రెవన్యూలో మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యం చేస్తారో అనే ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పారు.
01-03-2025 శనివారం ( పండగలా పింఛన్ల పంపిణీ )
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో బీసీ కాలనీలో వాసు అనే కల్లుగీత కార్మికుడుకి, ఎస్సీ కాలనీలో వసంతమ్మ అనే మహిళకు చంద్రబాబు పింఛన్ అందజేశారు. వసంతమ్మ తనకు సొంతిల్లు లేదని చెప్పగా మూడు సెంట్ల స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చిన్న కుమార్తె చదువుకు 50వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తానని అన్నారు. దీంతో పాటు జీవనోపాధి కోసం రెండు ఆవులు ఇప్పిస్తానని మాటిచ్చారాయన. పింఛన్ల పంపిణీ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రజావేదికలో మాట్లాడారు సీఎం.
01-03-2025 శనివారం ( పేదల ఆరోగ్యానికి భరోసా )
అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకూ 20వేలు సాయం చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. దీంతో పాటు రైతులకు పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లూ పంపిణీ చేస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలు వైద్యఖర్చులకు ఇబ్బంది పడకుండా రెండున్నర లక్షల రూపాయల బీమా అందిస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో భాగంగా పేద కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్యబీమా కల్పిస్తామని మాటిచ్చారు సీఎం. ఈ బడ్జెట్‌లో ఎస్సీ, బీసీ, అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు.
01-03-2025 శనివారం ( తల్లి వందనంతో జనాభా పెంపు )
ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి.. ఓట్ల కోసం ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలనేది మామూలు నాయకుడి లక్షణం. కానీ.. అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాల్లో ఏవిధంగా మార్పులు తీసుకొస్తాయని ఆలోచించేవారే విజనరీ లీడర్. ఆ కోవకు చెందినవారే చంద్రబాబు. ఎందుకంటే.. తల్లికి వందనం పథకం ద్వారా జనాభాను పెంచొచ్చనే విషయాన్ని గ్రహించారాయన. చదువుల ఖర్చులకు భయపడి పిల్లలను కనడానికి జంకుతున్నారు. అందుకే.. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకున్నా.. వారికి ఏడాదికి 15 వేలు ఇస్తామని ప్రకటించారు. పిల్లల చదువుల బాధ్యతను తాను చూసుకుంటానని.. జనాభాను పెరుగుదలపై ప్రజలు దృష్టిపెట్టాలని సూచించారు చంద్రబాబు.
01-03-2025 శనివారం (ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్)
సీఎం చంద్రబాబు నిర్ణయాలు ఎప్పడూ ఊహకందని విధంగా ఉంటాయి. అలాంటి మరో నిర్ణయమే శనివారం తీసుకున్నారాయన. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఆశావర్కర్లు గ్రాట్యుటీ లేదు. మొదటిసారిగా ఏపీలోనే అమలు కానుంది. సర్వీస్ పూర్తి అయ్యేసరికి లక్షన్నర రూపాయలు గ్రాట్యుటీ అందే అవకాశం ఉంది. అంతేకాదు ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేశారు. గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
01-03-2025 శనివారం (అద్భుత రాజదానికి అడుగులు)
ఏపీ ప్రభుత్వం పాలనను సాగిస్తూనే రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ చేసింది. హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభ, వెయ్యి 48 కోట్ల అంచనాతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెండర్లు ఎవరు దక్కించుకున్నారో ప్రకటించనున్నారు. 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం జరగనుంది. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుంది. 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మించనున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు 7 అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు.
01-03-2025 శనివారం (బదిలీలపై ఒత్తిళ్లకు చెక్)
పాలనతో ప్రభుత్వ ఉద్యోగుల పని తీరే కీలకం. ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ.. ఉద్యోగుల బదిలీలపై పొలిటికల్ లీడర్స్ ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి. ఈ విషయాన్నే గ్రహించారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయుల బదిలీలను ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శనివారం ముసాయిదాను రిలీజ్ చేసింది. దీనిపై ఈ నెల 7 వరకు వెబ్‌సైట్ ద్వారా సలహాలు, సూచనలు పంపించాలని తెలిపింది. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు, ఐదేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు బదిలీకి అర్హులు. బదిలీలను ఏడాదికి ఒక్కసారే, అదీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు. దీని ద్వారా రాజకీయ ఒత్తిళ్లు తగ్గుతాయి. ప్రభుత్వ, మండలం, జిల్లా పరిషత్తు, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలకు ఈ చట్టం వర్తిస్తుంది.
28-02-2025 శుక్రవారం (బాహుబలి బడ్జెట్)
ఏపీ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓ వైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు అభివృద్ధి పరుగులుపెట్టేలా కేటాయింపు చేశారు ఆర్థిక మంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా 3లక్షల 22 వేల 359 కోట్ల బడ్జెట్ పెట్టారు. అందులో 48వేల 341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ కూడా ఉంది. అసాధారణ రీతిలో 40వేల 635 కోట్ల రూపాయల మూల ధన వ్యయాన్ని కూడా ప్రతిపాదించారు.
28-02-2025 శుక్రవారం (సూపర్ సిక్స్‌కు భారీ కేటాయింపులు)
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి సూపర్-6లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు నిధులు కేటాయింపు జరిగింది. తల్లికి వందనం కోసం 9వేల 407 కోట్లు, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కలిపి 9వేల 400 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అమలు చేస్తున్న దీపం 2.0 పథకానికి 2వేల 601 కోట్లు కేటాయించింది. మత్స్యకారులకు వేట నిషేధకాలంలో భృతి కింద 246 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం.
సంపద సృష్టించడం, ఆ ఫలాల్ని పేదలకు అందించడం ఇది ప్రభుత్వ లక్ష్యం. ఏటా నిలకడగా 15 శాతానికిపైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తే 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. దాన్ని చేరుకునేందుకు పది మార్గదర్శక సూత్రాల్ని రూపొందించింది ప్రభుత్వం. వాటి సాధనకు ఈ బడ్జెట్‌లో అనేక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగానే 40వేల 635 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది.
28-02-2025 శుక్రవారం (ఎమ్మెల్యేలకు టార్గెట్స్)
శుక్రవారం అసెంబ్లీలోని కమిటీ హాలులో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో చంద్రబాబు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వారికి అండగా నిలబడాలని సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ గురించి మాట్లాడానికి పరిమితం కాకుండా వినియోగించుకోవాలని ఆదేశంచారు. వేసవి వస్తోంది కాబట్టి.. నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. దీనికోసం యాప్ కూడా తీసుకొస్తామన్నారు.
ఎవరి నియోజకవర్గాన్ని ఎవరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఓ రిపోర్టు రెడీ చేసుకోవాలని సూచించారు సీఎం. 2029 నాటికి ప్రతి కుటుంబానికీ ఇల్లు, నీటిసరఫరా, విద్యుత్ సదుపాయం, గ్యాస్ సరఫరా, ఇంటర్నెట్ అందించాలని టార్గెట్ పెట్టారు. ప్రతి గ్రామంలో రోడ్లు, లైట్లు, చెత్త సేకరణ, కాలుష్యం లేకుండా చేయడమే మన లక్ష్యమని అన్నారాయన.
27-02-2025 గురువారం (పీ4 అమలుకు పైలట్ ప్రాజెక్ట్)
సీఎం చంద్రబాబు బుర్రలో పుట్టిన మరో అద్భుతమైన ఆలోచన పీ4 విధానం. ఈ విధానం ప్రకారం సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు ఐశ్వర్యవంతులు మద్దతుగా నిలబడాలి. దాని కోసం ఓ ప్రణాళిక రెడీ చేసింది ప్రభుత్వం. పేదల సాధికారతకు ఉద్దేశించిన ఈ పీ 4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి అమలు చేయనుంది. దీనిపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా 4 గ్రామాల్లో అమలు చేస్తారు. ఈ గ్రామాల్లోని 5వేల 869 కుటుంబాలు లబ్ధిపొందుతాయి. పీ 4 విధానం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను అధికారులు గుర్తిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 40 952లక్షల కుటుంబాలు పీ 4కు అర్హులుగా అధికారులు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన సర్వే జరుగుతోంది.
27-02-2025 గురువారం (అక్రమాలకు అడ్డుకుట్ట)
అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా చేసే నిర్మాణాలపై చర్యలకు రెడీ అయింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను గురువారం రిలీజ్ చేసింది. భవన నిర్మాణ పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
25-02-2025 మంగళవారం ( హామీల అమలు దిశగా అడుగులు)
వెంటిలేటర్‌పై ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం సాయంతో ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. గవర్నర్ ప్రసంగానికి మంగళవారం చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో మూడుపార్టీలు కలిసి అధికారంలో వచ్చాయని చెప్పారాయన. ప్రధాని సకాలంలో స్పందించి అన్నివిధాలా సహకరించారని ప్రశంసించారు. ఆ సహకారం లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడేవాళ్లమని గుర్తుచేశారు.
వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే నాటికి తెరిచే నాటికి డీఎస్సీ ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. చదువుకునే పిల్లలు ఎందరున్నా, అందరికీ మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇస్తామని తెలిపారు. మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే 20 వేల చొప్పున ఇస్తామని అన్నారు. త్వరలో నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చెప్పారు సీఎం. మిర్చి రైతులు అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఏ రైతూ ఆందోళన చెందకుండా ఆదుకుంటామని అన్నారాయన. రైతుల కోసం 100 కోట్లతో నిధి పెడతామని మరో సంచలన ప్రకటన చేశారు.
24-02-2025 సోమవారం ( రియల్ టై గవర్నెన్స్‌పై రివ్యూ)
సోమవారం సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్‌పై సచివాలయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వాట్సప్ సేవలపై అవగాహన కల్పించేలా క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభతరంగా సేవలు అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం అధికారులకు తెలిపారు. ప్రజల వినతులు, వాటి పరిష్కారాలను కూడా మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో శాంతిభద్రతల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీసు గస్తీతోపాటు డ్రోన్లను వినియోగించాలని ఆదేశించారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని సీఎం ఆలోచన. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థ ఉంటే బస్సు ఏ ప్రాంతంలో ఉందనే సమాచారం ప్రయాణికులకు తెలుస్తుందని చెప్పారు. ఉచిత ఇసుక సరఫరా చాలా వరకు మెరుగైనా.. ఇంకా అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయని అన్నారు. వాటిని క్లియర్ చేయాలని సూచించారు.
24-02-2025 సోమవారం ( ప్రతిపక్షం లేకపోయినా గట్టి పోటీ)
సోమవారం బీఏసీ సమావేశం జరిగింది. 27 అంశాలను టీడీపీ, 13 అంశాలను బీజేపీ ప్రతిపాధించాయి. కేజ్రీవాల్ పాలనపై చంద్రబాబు బీఏసీ మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం సంక్షేమంతోనే పరిపాలన కుదరని కేజ్రీవాల్ పాలన రుజువు చేసిందని అన్నారు. సంక్షేమానికి అభివృద్ధి తోడుకావాల్సిందేనని చెప్పారాయన. జనసేన సభ్యులకు ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వాలని కోరారు మంత్రి నాదెండ్ల మనోహర్. తమకూ ప్రశ్నలు తక్కువగా వస్తున్నాయని విష్ణుకుమార్‌రాజు కోరారు. ప్రభుత్వంలో భాగమే అయినప్పటికీ ప్రజా సమస్యల ప్రస్తావన కోసం అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. మాట్లాడాలని.. ప్రజా సమస్యలు సభలో ప్రస్తావిస్తేనే ప్రభుత్వానికి తెలుస్తాయని సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు.