BigTV English
Advertisement

OTT Movie : బయట జోరుగా వర్షం …గదిలో ఒంటరి అమ్మాయి… రాత్రంతా అరుపులే

OTT Movie : బయట జోరుగా వర్షం …గదిలో ఒంటరి అమ్మాయి… రాత్రంతా అరుపులే

OTT Movie : స్టూడెంట్, టీచర్ల మధ్య జరిగే లవ్ స్టోరీ లతో చాలా సినిమాలు వచ్చాయి. ఈ లవ్ స్టోరీలు హద్దులు దాటితే, వచ్చే ప్రమాదాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో స్టూడెంట్, టీచర్ ల మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. ఒక వర్షం కురిసిన రాత్రి వీళ్ళిద్దరూ పడక గదిలో రెచ్చిపోతారు. ఈ వ్యవహారం చాలా మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు ‘మిల్లర్స్ గర్ల్’  (Millers girl). 2024 లో విడుదలైన ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీకి జేడ్ హాలీ బార్ట్‌లెట్ దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నా ఒర్టెగా ఒక విద్యార్థిగా, మార్టిన్ ఫ్రీమాన్  ఉపాధ్యాయునిగా నటించారు. వీళ్ళు సృజనాత్మక రచన అసైన్‌మెంట్ తర్వాత అక్రమ సంబంధంలోకి ప్రవేశిస్తారు. ‘మిల్లర్స్ గర్ల్’ యునైటెడ్ స్టేట్స్‌లో జనవరి 26, 2024న లయన్స్‌గేట్ ద్వారా థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కైరో బాగా డబ్బున్న ఒక అందమైన అమ్మాయి.ఈమె కాలేజీ లో చదువుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఈమెతో సమయం కూడా కేటాయించకుండా బిజీగా ఉంటారు. కైరోకి నవలలు రాయాలని ఆలోచన ఉంటుంది. తన టీచర్ రాసిన ఒక బుక్ ని అనుకోకుండా చదువుతుంది. ఆ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడో పెళ్లి కాకముందు రాసిన నవలని కైరో పొగడటంతో టీచర్ బాగా ఇంప్రెస్ అవుతాడు. అలా వీళ్ళిద్దరి మధ్య పరిచయం బాగా పెరుగుతుంది. ఒకరికి ఒకరు ఇష్టం ఉన్నా, కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి టీచర్ పెళ్లి కాకముందు ఒక పెద్ద రైటర్ అవ్వాలనుకుంటాడు. పెళ్లి తర్వాత అది కుదరకుండా పోతుంది. ఇప్పుడు కైరో రైటర్ అవ్వాలనుకుంటుంది. అయితే తన టీచర్ తో రొమాన్స్ చేసి అదే స్టోరీని రాయాలనుకుంటుంది. అలా టీచర్ ని తన రూమ్ కి పిలిపించుకుంటుంది.

టీచర్ కూడా ఎప్పటినుంచో దీని కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉంటుంది. తడిసిన బట్టల్లో కైరో అందాలు మరింత అందంగా ఉంటాయి. టీచర్ కి ఆమెను చూసి మతిపోతుంది. ఆ రాత్రి ఇద్దరూ కామ క్రీడలో మునిగి తేలుతారు. ఆ తర్వాత ఇదే స్టోరీని ఒక బుక్ రూపంలో రాస్తుంది కైరో. దానిని చూసి టీచర్ కైరోపై కోప్పడతాడు. టీచర్ తిట్టడంతో కైరో కి కూడా కోపం వస్తుంది. ఆ తర్వాత టీచర్ పై స్కూల్ యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తుంది. ఆధారాలు లేకపోవడంతో, అమ్మాయితో చనువుగా ఉన్నాడని టీచర్ని సస్పెండ్ చేస్తారు. ఈ విషయం తెలిసి భార్య కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. చివరికి టీచర్ పరిస్థితి ఏమవుతుంది? కైరో రైటర్ అవుతుందా? ఈ విషయాలను మీరు కూడా  తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మిల్లర్స్ గర్ల్’  (Millers girl) అనే  ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×