Pushpa 2 Teaser got 110M+ Views in Just 138 Hours in YouTube: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప2 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకోవడంతో.. సెకండ్ పార్ట్‌ని మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచేశాయి. అయితే రీసెంట్‌గా విడుదలైన పుష్ప 2 టీజర్ ఆ అంచనాలను మరింత స్థాయికి తీసుకెళ్లింది.
టీజర్‌లో ఐకాన్ స్టార్ లుక్ ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో మొత్తం జాతర సీన్లనే చూపించారు. జాతర సీన్లు, జాతర యాక్షన్, జాతర కాస్ట్యూమ్‌తో టీజర్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా బన్నీ లుక్ ఊర మాస్‌గా ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇలాంటి లుక్‌లో బన్నీని ఎప్పుడూ చూడలేదని.. ఈ టీజర్‌తో సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థమైందని చాలామంది చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేస్తుంది. అతి తక్కువ టైంలోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి అదరగొట్టేసింది. తాజాగా ఈ టీజర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్లకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది.
Also Read: Pushpa 2 Update: పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. క్రేజీ కాంబో వస్తోంది!
#Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥
Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg
— Pushpa (@PushpaMovie) April 14, 2024
ఇదే విషయాన్ని తాజాగా పుష్ప టీం తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై బన్నీ అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. రిలీజ్‌కు ముందే పుష్ప 2 ఇలాంటి రికార్డులు క్రియేట్ చేస్తే.. రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని పలువురు అంటున్నారు.
ఇకపోతే ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 15న రిలీజ్ కానుంది.