E-Paper
Advertisement

 Animal 3Rd day collections  : బాక్సాఫీస్ రికార్డుల మోత.. మూడోరోజు యానిమల్ కలెక్షన్స్..

 Animal 3Rd day collections  : బాక్సాఫీస్ రికార్డుల మోత.. మూడోరోజు యానిమల్ కలెక్షన్స్..
Advertisement
Animal 3Rd day collections 

Animal 3Rd day collections : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రష్మిక మందాన కాంబినేషన్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు నుంచే రికార్డు లెవెల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. తండ్రి కొడుకు సెంటిమెంట్ ని పిక్ లెవెల్ లో చూపిస్తూ.. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని ఫుల్ గా కుష్ చేస్తుంది.

మొదటి షో తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో నిండిపోయింది. వీకెండ్ కూడా వచ్చి రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక దిల్ రాజ్ ఈ మూవీను రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 15 కోట్లకు కొనుగోలు చేశాడు. మూడవ రోజు నుంచి ఈ చిత్రం ప్రాఫిట్ బాట పట్టినట్టు తెలుస్తోంది. ఇటు బాలీవుడ్ లో కూడా వీకెండ్ కలెక్షన్స్ బాగానే వసూల్ అయినట్టు తెలుస్తుంది.

Advertisement

తెలుగులో అర్జున్ రెడ్డి ..హిందీలో కబీర్ సింగ్.. మూవీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి ఈ చిత్రంతో హిట్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా 176 కోట్ల రూపాయలు ఒక్క బాలీవుడ్ లోనే రాబట్టిందని టాక్. అయితే ఈ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని నిజానికి ఎవరు ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడవ రోజుకి సుమారు 360 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా బోల్డ్ గా.. కాస్త ఓవర్ గా ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు.. అయినప్పటికీ మూవీ పర్ఫామెన్స్ పై ఎటువంటి ప్రభావం పడడం లేదు.రణబీర్ కపూర్ కెరీర్ లో చాలా ఫాస్ట్ గా 300 కోట్ల రూపాయల మార్కు అందుకున్న మూవీ యానిమల్. వీకెండ్ హడావిడి పూర్తయింది అయినా కానీ యానిమల్ కలెక్షన్స్ హడావిడి మాత్రం ఇంకా పూర్తి కాలేదనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×