E-Paper
Advertisement

Animal deleted scene : యానిమల్ మూవీ లో ఆ సీన్ మిస్సింగ్.. చూసుకోవద్దు సందీపూ…

Animal deleted scene  : యానిమల్ మూవీ లో ఆ సీన్ మిస్సింగ్.. చూసుకోవద్దు సందీపూ…
Advertisement
Animal deleted scene

Animal deleted scene : సందీప్ రెడ్డి వంగ.. రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రం మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇటు సౌత్ లో కూడా స్ట్రైట్ తెలుగు సినిమాలతో సమానంగా భారీ ఆదరణ అందుకుంటుంది. ఈ మూవీ చూసిన అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల మోత మోగిస్తున్నారు.

ఒకపక్క రొమాంటిక్ సన్నివేశాలతో హీట్ పుట్టిస్తూ.. సెంటిమెంట్తో మనసును పిండేస్తూ..మరోపక్క యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొడుతోంది ఈ చిత్రం. మూవీ ట్రైలర్ ప్రమోషన్స్ తోనే ఒక వర్గం ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఫస్ట్ డే నే చూడాలి అని ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని చిత్రంపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఉండడంతో ఫస్ట్ డే మూవీ చూడాలి అనే వారి సంఖ్య బాగా పెరిగింది. ఫస్ట్ డే మూవీకి వెళ్లారు.. సినిమా బాగుందన్నారు.. మెచ్చుకున్నారు ..ఇక్కడ దాకా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కాకపోతే అసలు సినిమాకి హైప్ క్రియేట్ చేసిన ఒక కీలకమైన సీన్ మాత్రం సినిమాలో లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement

తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ చేస్తూ ‘నానా నువ్వే ప్రాణం’..అంటూ వచ్చిన లిరికల్ వీడియో లో ఒకచోట రణబీర్ తాగి.. విమానం పైలెట్ ని లేపి డ్రైవింగ్ తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ఆ సమయంలో ఆ ప్లేన్ లో అతనితోపాటు ఉన్న ఒక సిక్ గ్యాంగ్ అతన్ని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.. వెనక వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. బాధని.. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ హీరో ఎక్స్ప్రెషన్స్.. ఆ సీన్ ను అందరి హృదయాలకు హత్తుకునేలా చేశాయి.

లిరికల్ వీడియోలో ఈ సీన్ చూసిన ఎందరో వెండితెరపై ఈ సీన్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అని అనుకున్నారు. అయితే ఇంతకీ సినిమా హాల్ కి వెళ్లిన తర్వాత అసలు ఆ సీన్ లేకపోవడంతో షాక్ అయ్యారు. ఇంత మంచి సీన్ ని సందీప్ ఎందుకు తీసేసాడు.. అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ప్రశ్నగా మారింది. లెంత్ ఎక్కువైంది రిమూవ్ చేశాడు అనుకుందామంటే.. ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ ఎన్నో ఉన్నాయి కదా వాటిని తీసేసి వాటి బదులు ఇది ఉంచొచ్చు కదా అని వాదిస్తున్నారు. కొందరు మీమర్స్ దీనిపై విచిత్రమైన మిమ్స్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సందీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×