E-Paper
Advertisement

Rashmika Video : రష్మిక మరో ఫేక్ వీడియో వైరల్.. అభిమానులు ఫైర్

Rashmika Video : రష్మిక మరో ఫేక్ వీడియో వైరల్.. అభిమానులు ఫైర్
Advertisement
Rashmika Video

Rashmika Video : ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకెళ్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన ఆమెను ఇప్పుడు ఫేక్ వీడియోలు పట్టి పీడిస్తున్నాయి. నాలుగురోజుల క్రితమే రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన ఒక డీప్ ఫేక్ ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వగా.. వాటిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని కేంద్రం సైతం సీరియస్ గా తీసుకుంది. అయినా ఆకతాయిలు ఆగలేదు. మరోసారి ఇంకొక డీప్ ఫేక్ వీడియోను సృష్టించి నెట్టింట పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. ఎవరూ నమ్మొద్దంటూ పోస్టులు పెడుతున్నారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ తారా పటేల్ వీడియోకు రష్మిక ఫేస్ ను జోడించి వీడియో క్రియేట్ చేయగా.. దానిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దానిపై అమితాబ్, కీర్తి సురేష్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ సహా.. పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రష్మిక సైతం ఈ ఘటనపై ఆవేదన చెందింది.

Advertisement

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తే చాలా భయంగా ఉందని వాపోయారు. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే మరో మార్ఫింగ్ వీడియో వైరల్ అవ్వడం.. ఇండస్ట్రీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలాంటి వీడియోలు, ఫొటోలు కేవలం రష్మికకే కాదు. కత్రినా కైఫ్ విషయంలోనూ జరిగింది. సెలబ్రిటీలకే ఇలాంటి వాటి నుంచి రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడేవారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×