Kanthara-2 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ‘కాంతారా’.. ఈ మూవీకి సీక్వల్ గా ఇప్పుడు కాంతారా 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. మొన్న ఆ మధ్య షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో సినిమా అకస్మాత్తుగా ఆగిపోయింది.. కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ కొల్లూరు సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. భోజన విరామం తర్వాత నదిలో ఈతకు వెళ్లిన కపిల్ కొట్టుకుపోయారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. మరో ఆర్టిస్ట్ మృతి చెందారు. కేరళకు చెందిన విజా వికె గుండెపోటుతో మరణించాడు. అదే విధంగా హీరో ఫ్రెండ్ గా నటించిన రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించాడు.. ప్రస్తుతం నటుడి మృతితో షూటింగ్ ఆగినట్లు సమాచారం.. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వరుసగా ఇలాంటివి ఎదురవ్వడం పెద్ద యూనిట్ కు పెద్ద షాకే అని ఫిలిం నగర్లో టాక్..
‘కాంతారా 2’ సెట్ లో వరుస మరణాలు..
రిషబ్ శెట్టి, హీరో, డైరెక్టర్ గా చేసిన మూవీ కాంతారా.. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులో నటిస్తున్న నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. తాజాగా మరో నటుడు విజా వికె నిన్న అర్ధరాత్రి చాతిలో నొప్పితో ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల వయసు కలిగిన ఈ నటుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో మిథిలా హోమ్‌స్టేలో ఇతర సిబ్బందితో కలిసి బస చేశారు. అర్థరాత్రి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఆయనను అంబులెన్స్‌లో తీర్థహళ్లిలోని జెసి ఆసుపత్రికి తరలించారు, కానీ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.. మొత్తంగా ముగ్గురు నటులు వివిధ కారణాలతో మరణించారు. నెల కూడా గడవక ముందే మరొకరు చనిపోవడంతో చిత్ర యూనిట్ విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తుంది.
Also Read:‘తమ్ముడు’ కోసం నితిన్ షాకింగ్ నిర్ణయం..?
మూవీ షూటింగ్ అప్డేట్..
2022లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కాంతారాకు ప్రీక్వెల్. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించగా హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. కదంబ రాజవంశం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది. టీజర్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ టైం దగ్గర పడటంతో నిర్వీరామంగా షూటింగ్ చేస్తున్నారు టీమ్. ప్రస్తుతం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని అగుంబేలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నటుడు మృతి చెందాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న ఇద్దరు చనిపోయారు.. ఇప్పుడు మరో వ్యక్తి మరణించడంతో కాంతారా టీమ్ కు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఈ వార్త విన్న అభిమానులు ఫీల్ అవుతున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం.